హను మాన్ ఓటిటి రిలీజ్ గురించి ప్రశాంత్ వర్మ క్లారిటీ !

Prashanth Varma Clarity About Hanuman OTT Release!
Prashanth Varma Clarity About Hanuman OTT Release!

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో సినిమా హను మాన్. ఈ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకి పైగానే వసూళ్లు రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ మూవీ ఓటిటి రిలీజ్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఓటిటి రిలీజ్ పై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా లో పోస్ట్ ని షేర్ చేశారు. హనుమాన్ ఓటిటి స్ట్రీమింగ్ ఆలస్యం ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదు. మేము విషయాలని క్రమబద్ధీకరించడానికి మరియు వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంతంగా పని చేస్తున్నాము. మా ఉద్దేశ్యం ఎల్లప్పుడూ మీకు ది బెస్ట్ అందించడం తప్ప మరేమీ కాదు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు మాకు మద్దతు ఇవ్వడం కొనసాగించండి, ధన్యవాదాలు అని అంటూ చెప్పుకొచ్చారు.

Prashanth Varma Clarity About Hanuman OTT Release!
Prashanth Varma Clarity About Hanuman OTT Release!

అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రశాంత్ వర్మ నెక్స్ట్ జై హను మాన్ మూవీ కి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.