మహేష్ బాబు “గుంటూరు కారం” ఫస్ట్ సింగిల్ ప్రోమో అవుట్

మహేష్ బాబు
Cinema News

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ వాంటెడ్ సినిమా గుంటూరు కారం. వచ్చే సంక్రాంతికి ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమా పై నెట్టింట తెగ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

మహేష్ బాబు "గుంటూరు కారం" ఫస్ట్ సింగిల్ ప్రోమో అవుట్
Mahesh Babu

మొదటగా హీరోయిన్‌ గా తీసుకున్న పూజా హెగ్డే స్థానంలో శ్రీలీల ఈ సినిమాలోకి రాగా.. ఇటీవలే.. మీనాక్షి చౌదరి కూడా వచ్చారు. అయితే.. తాజాగా గుంటూరు కారం మూవీ నుంచి దమ్ మసాలా అంటూ సాగే పాట ప్రోమోని విడుదల చేశారు. ఇందులో ఎలాంటి వీడియో బైట్స్ చూపించకుండా కేవలం మోషన్ పోస్టర్ తోనే పాట రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ త్వరలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా….. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.