మైండ్ ఫుల్ ఈటింగ్ ఎంతో అవసరం

మైండ్ ఫుల్ ఈటింగ్ ఎంతో అవసరం

మీ గట్ యొక్క ఆరోగ్యం బాగుండాలని అనుకుంటే, ప్రతి రోజు ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి. ఆరోగ్యకరమైన శరీరం మరియు మనసు పొందాలంటే మైండ్ ఫుల్ ఈటింగ్ ఎంతో అవసరం. ప్రస్తుతం చాలా శాతం మందిలో జీర్ణ ప్రక్రియకు సంబంధించిన సమస్యలు పెరిగిపోతున్నాయి. కాబట్టి అందరూ ఆహారపు అలవాట్ల విషయానికొచ్చే సరికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రస్తుతం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలో అందరూ ఆలోచిస్తున్నారు కానీ ఆయుర్వేదంలో ఆహారపు అలవాట్ల గురించి ఎప్పుడో చెప్పబడింది. ఆయుర్వేదిక్ డైట్ ప్రకారం ఆహారాన్ని తీసుకోవడంలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఎటువంటి ఆహారం ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి మరియు మీ శరీరానికి ఎటువంటి ఆహారం తీసుకుంటే ప్రయోజనమో కూడా తెలుసుకోవచ్చు. ఆయుర్వేదిక్ నిపుణులు గట్ ఆరోగ్యం కోసం ఆయుర్వేదం నుండి కొన్ని నియమాలను మనకు తెలిపారు.

వాటి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడే దీని కోసం పూర్తిగా చూసేయండి.మీకు ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి. మీకు సహజంగా ఆకలి వేస్తే మీరు అంతకు ముందు తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం అయ్యిందని అర్థం. కానీ కొన్నిసార్లు ఆకలి వేస్తోంది అని అనుకుంటాము కానీ అది డీహైడ్రేషన్ వల్ల కూడా కావచ్చు. కాబట్టి మీకు నిజంగానే ఆకలి వేసిందని అనిపిస్తేనే తినండి.ప్రశాంతకరమైన వాతావరణంలో కూర్చుని మెల్లిగా మాత్రమే తినండి.

కింద కూర్చుని తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎటువంటి డిస్ట్రేక్షన్ లేకుండా చూసుకోండి, అంటే బుక్స్, టీవీ, మొబైల్, మరియు ల్యాప్టాప్ వంటి వాటికి దూరంగా ఉండండి. అయితే ఈ మధ్య కాలం లో చాలా మంది టీవీ, ఫోన్ లేకపోతే తినడం లేదు. ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా ఫోన్ లేకపోతే అన్నం తినడం లేదు. కానీ అలా తినడం అస్సలు మంచి అలవాటు కాదు.
జీర్ణ సమస్యలు

అదే విధంగా సరైన క్వాంటిటీ మాత్రమే తీసుకోండి. ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఆకలి వేయదు మరియు ఒక్కొక్కరి స్టమక్ సైజ్ వేరు వేరుగా ఉంటుంది. మీకు ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ కలుగుతుందో అప్పటి వరకు మాత్రమే తినండి.అలానే ఆహారాన్ని కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తినండి, అంటే తాజాగా వండిన ఆహారాన్ని తినడానికి మాత్రమే ప్రయత్నించండి. ఫ్రిజ్‌లో నిలవబెట్టిన ఆహారాన్ని తినడం వల్ల మీ జీర్ణ ప్రక్రియ పాడవుతుంది మరియు దాంతో డైజెస్టివ్ ఎంజైమ్స్ సరిగా పని చేయలేవు.

మంచి క్వాలిటీ ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. మీరు తీసుకునే ఆహారం కొంచెం జ్యూసీగా లేదా చాలా తక్కువ నూనె ఉండే విధంగా చూసుకోండి. దాంతో జీర్ణ ప్రక్రియ చాలా సులువుగా జరుగుతుంది. వీటితో పాటు ముఖ్యంగా పోషక విలువలు ఉండేటు వంటి ఆహారాన్ని తీసుకోండి. బాగా పొడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ సరిగా జరుగదు. అలానే బయట తయారు చేసే ఆహార పదార్ధాలలో కల్తీ జరుగుతుంది. అలానే తక్కువ క్వాలిటీ తో ఆహారాన్ని చేస్తారు.

కనుక వీటి జోలికి అస్సలు వెళ్ళద్దు. వాటిని తింటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తయి.అలానే రెండు రకాల భిన్నమైన ఆహారాలని కలిపి తీసుకోకండి. అలా తీసుకోవడం వల్ల స్టమక్ అప్సెట్ జరుగుతుంది. అందులో కొన్ని పండ్లు మరియు పాలు, చేప మరియు పాలు వంటివి కలిపి తీసుకోకండి. ఇది కూడా జాగ్రత్తగా గమనించి తీసుకోండి. లేదు అంటే సమస్యలు తప్పవు. అందుకని ఇది కూడా ఫాలో అవ్వడం మంచిది.

ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఏకాగ్రతతో తినండి అంటే ఐదు ఇంద్రియాలను ఉపయోగించి తినండి. మీరు తీసుకునే ఆహారం యొక్క వాసనను చూడండి, మీరు తినే ఆహారం యొక్క టెక్స్చర్ మరియు ఫ్లవర్స్ వంటి వాటిని గమనించండి. దాంతో పాటు మీరు ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఎటువంటి శబ్దం వస్తుందో గమనించండి. ఇటువంటి వాటి అన్నింటికీ సమయాన్ని కేటాయించండి.అలానే ఆహారాన్ని చాలా త్వరగా తినకండి మీరు తీసుకునే ఆహారాన్ని నములుతూ తినాలి. అంతే కానీ ఆహారాన్ని మింగకూడదు.

జీర్ణ ప్రక్రియ సాఫీగా కొనసాగించాలంటే నమలడం ఎంతో అవసరం. కాబట్టి ఇది కూడా మరిచిపోకండి. లేదు అంటే మీకు ఇబ్బంది రావడం పక్కా.ఇది ఇలా ఉంటే రెగ్యులర్ టైం ను తప్పకుండా పాటించండి. ప్రతిరోజు అదే టైమ్‌కు ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆహారం జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. చాలా మంది పని లో పడిపోయి.. ఆహారాన్ని సమయానికి తీసుకోరు. అలా చెయ్యడం నిజంగా చెడ్డ అలవాటు. కాబట్టి సమయానికి ఆహారం తీసుకోండి. చూసారు కదా ఎలాంటి టిప్స్ ని ఆహారం విషయం లో ఫాలో అవ్వాలో.. మరి వాటిని ఫాలో అయ్యి సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా వుండండి. దీనితో ఆనందంగా కూడా మీరు ఉండచ్చు.