హైదరాబాద్ నడిబొడ్డున ఆరేళ్ళ బాలిక మీద దారుణం !

9th Class boy raped in boy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఈ రోజు దారుణ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని పాతబస్తీలోని శాలిబండ ఏరియాలో ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి ప్రయత్నించాడు. పోలీసులు అందచేసిన వివరాల ప్రకారం శాలిబండ ప్రాంతానికి చెందిన హబీబ్ హమాద్ అనే వ్యక్తి అదే ప్రాంతంలో ఆడుకుంటున్న ఓ బాలిక మీద కన్నేశాడు. చాక్లెట్లు ఇప్పిస్తానని ఆ బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ఆ బాలిక మీద అనంతరం లైంగికదాడికి యత్నించాడు. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా బెదిరిపోయిన బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అక్కడకు చేరుకోగానే నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా నిందితుడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాగా, నిందితుడిపై కేసు నమోదుచేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.