ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

భార్య తీరుతో మనస్తాపం చెంది కడంబత్తూరు యూనియన్‌ పుదుపట్టు గ్రామానికి చెందిన నటరాజన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడికి తిరునిండ్రవూర్‌కు చెందిన యువతితో గత ఏడాది వివాహమైంది. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారం క్రితం జ్యోతికి ఆడబిడ్డ పుట్టింది.

అయితే బిడ్డ పుట్టిన విషయాన్ని చెప్పకపోవడంతో నటరాజన్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 21న పెళ్లిరోజు కావడంతో భార్యకు కాల్‌ చేశాడు. ఆమె తీయకపోవడంతో కలత చెంది ఆదివారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.