ఈ ప్రేమలు మనకొద్దు, అమ్మాయిలు డేంజర్… పవన్ ఫ్యాన్ ఆత్మహత్య !

Man self Suicide Due to Love Failure in Vijayawada Lodge

పాపం ఒకమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు, చేసేది సేల్స్‌మ్యాన్‌ ఉద్యోగమే అయినా సంపాదన అంతా అమ్మాయికి పెట్టేందుకు అతను వెనుకాడలేదు. కానీ ఆ నయవంచకి ప్రేమించినట్లు నటించింది. అది తెలియని ఆ కుర్రాడు ఆమెను సంతోషంగా ఉంచేందుకు తను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. కానీ మనోడి దగ్గర ‘విషయం’ అంతా అయిపోయి అప్పుల పాలయ్యే సరికి ఆ నరరూప ఊసరవెల్లి హ్యాండిచ్చింది. చివరికి దిక్కుతోచని స్థితిలో ప్రాణం తీసుకున్నాడు ఆ ప్రేమికుడు. విజయవాడ జరిగిన ఈ ఘటన అందరి కళ్ళ వెంటా కన్నీళ్ళు తెప్పిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వంశీకృష్ణ విజయవాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల కిత్రం గవర్నరుపేట ఆలీబేగ్‌ వీధిలోని ఓ లాడ్జిలో దిగాడు. మంగళవారం మధ్యాహ్నం లాడ్జి సిబ్బందికి కనిపించాడు. రాత్రి 8 గంటల సమయంలో తలుపులు కొట్టినా తీయకపోవడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా గదిలో ఉరేసుకుని కనిపించాడు.

సూసైడ్‌ నోట్‌ను బట్టి తన జీవితాన్ని ప్రియురాలు నాశనం చేసిందని లేఖలో విరక్తి వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగత వివరాలతో పాటు యువతకు సందేశం ఇచ్చాడు. ప్రేమ పేరుతో సమయం వృథా చేసుకోవద్దని అమ్మాయిల చేతిలో మోసపోవద్దని హెచ్చరికలు కూడా చేశాడు. ప్రేమ విషయంలో తొందర పడవద్దని ఒకటికి రెండు సార్లు తన లేఖలో వంశీకృష్ణ చెప్పడంతో అతను ప్రేమించిన అమ్మాయి ఎంత నమ్మించి మోసం చేసిందో అర్ధం చేసుకోవచ్చు. సూసైడ్ లెటర్ ఆధారాంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ లేఖలో ఉన్న మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… తను పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ట… తాను పవన్‌ కల్యాణ్‌ అభిమానినని… ఆయన్ని ఒకసారి కూడా చూడలేదని… వచ్చే ఎన్నికల్లో పవన్‌ గెలుపొందాలంటూ ఆకాంక్షించాడు. పోలీసులు వంశీకృష్ణ సెల్ఫీ వీడియోను సీజ్ చేశారు.