మోడీ సంచలన నిర్ణయం…ఇక ఇన్ కం టాక్స్ రద్దు !

PM Modi has planned to abolish income tax in the next budget

నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు బాంబుల్లా పేలి, మోదీపై ప్రజా వ్యతిరేకతను పెంచగా మోడీ మీదా కేంద్రం మీదా ఉన్న ప్రజాగ్రహం తగ్గించకుంటే, గెలుపు క్లిష్టతరమవుతుందన్న ఆలోచనలో సానుకూల పవనాలు వీచేందుకు కమలనాథులు ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాల వల్ల ఏ ఉద్యోగులు, వ్యాపారవర్గాలైతే బిజెపిని ఆకాశానికెత్తేయో ఆ వర్గాలే ఇప్పుడు భగ్గుమంటున్నాయి. మోడీపైన ఈగ వాలనీకుండా చూసి ప్రజలే దూరమైనపుడు వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎలా.అనే ఆందోళన జెపిపి నేతల్లో మొదలయింది. దేశ ప్రజలను సంతోషంలో ముంచడానికి సిద్ధమవుతున్న మోదీ, ఆదాయపు పన్నును రద్దు చేస్తే, గెలుపు సులువవుతుందని నమ్ముతున్నట్టు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలంటే, కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, సంచలన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత, కేంద్రానికి పన్ను ఆదాయం గణనీయంగా పెరగడం, బ్యాంకు లావాదేవీల సంఖ్య పెరగడంతో వ్యక్తుల నుంచి ఆదాయపు పన్ను వసూళ్లను రద్దు చేయాలని ఆయన భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈ సంవత్సరం ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి ప్రసంగించే వేళ, తన నోటివెంట ఈ నిర్ణయాన్ని ఆయన ప్రకటిస్తారని బీజేపీ నేతలు అంటున్నారు. వాస్తవానికి ఈ ప్రతిపాదన ఈనాటిది కాదు. పెద్ద నోట్లను రద్దు చేసిన వేళే వచ్చింది. నోట్ల రద్దుతో వ్యవస్థ బాగుపడుతుందని ప్రతిపాదించిన ‘అర్థగ్రంధి’ సంస్థ అదే సమయంలోనే ఆదాయపు పన్ను రద్దు అంశాన్నీ ప్రతిపాదించింది. నగదు రహిత సమాజం విస్తరిస్తే, ఇన్ కం టాక్స్ వసూలు అవసరం లేదని పేర్కొంది.

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలోనే ఆదాయపు పన్ను రద్దును కోరారు. ఆదాయపన్ను రూపంలో భారత ప్రభుత్వానికి ఏటా రూ.4 లక్షల కోట్లు వస్తోంది. జిఎస్‌టిని పక్కాగా వసూలు చేస్తే ఈ లోటును అక్కడ పూడ్చుకోవడం పెద్ద సమస్య కాబోదు. ఆదాయ పన్ను రద్దు చేస్తే పొదుపు పెరుగుతుందని చెబుతున్నారు. పన్నులకు భయపడే జనం డబ్బులను బ్యాంకుల్లో పెట్టకుండా ఇంట్లో దాచుకుంటున్నారని, ఇది ఆర్థిక వ్యవస్థకు నష్టమనేది సుబ్రమణ్యస్వామి వాదన. ఆదాయ పన్ను రద్దు చేయడం ద్వారా బ్యాంకుల్లో పొదుపు పెరుగుతుందని, ఈ డబ్బులు దేశాభివృద్ధికి ఉపయోగపడుతాయని వాదిస్తున్నారు. ఇక ఆదాయపు పన్నును రద్దు చేసిన పక్షంలో కేంద్ర ఖజానాకు ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి మరో ప్లాన్ ను కూడా మోదీ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే బీటీటీ (బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ టాక్స్). అంటే, ప్రతి బ్యాంకు లావాదేవీపైనా పన్ను ఉంటుంది.
డబ్బు వేసినా, తీసినా, ఆన్ లైన్ లో ఖర్చు చేసినా, కార్డు గీకినా కొంత మొత్తం కేంద్ర ఖజానాకు చేరిపోతుంది. ఆదాయపు పన్ను రద్దు నిర్ణయాన్ని మోదీ తీసుకుంటే, ఆయన తీసుకున్న అత్యంత సంచలన నిర్ణయం ఇదే అవుతుందనడంలో సందేహం లేదు.

వచ్చే అగస్టు 15న ప్రధాన మంత్రి కీలక ప్రకటన చేస్తారని, అది దేశాన్ని మొత్తం ప్రభావితం చేస్తుందని బిజెపి నాయకులు చెబుతున్నారు. ఆ ప్రకటన ఏమిటనేది మాత్రం చెప్పడం లేదు. అది ఆదాయ పన్ను రద్దు నిర్ణయమేనని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న ప్రధాని నోటి వెంట పన్ను రద్దు మాటలు వస్తాయా? రావా? అన్నది వేచి చూడాల్సిందే.