దసరా జాబితా పెరుగుతూనే ఉంది

tollywood-movies-release-for-dasara2018

స్టార్‌ హీరోల సినిమాలు పండుగలకు విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్రంను దసరాకు విడుదల చేయబోతున్నట్లుగా చాలా రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అరవింద సమేత చిత్రంను అక్టోబర్‌లో దసరా కానుకగా విడుదల చేయబోతున్న నేపథ్యంలో చిన్న చిత్రాలు విడుదల అయ్యే అవకాశం లేదని అంతా భావించారు. అయితే దసరా కానుకగా పెద్ద ఎత్తున చిత్రాలను విడుదల చేసేందుకు చిన్న, పెద్ద నిర్మాతలు క్యూ కడుతున్నారు. అరవింద సమేత చిత్రానికి పలు చిత్రాలు పోటీగా రంగంలోకి దిగబోతున్నాయి.

‘అరవింద సమేత’ చిత్రానికి మెయిన్‌ పోటీ నాగార్జున, నానిలు కలిసి నటించిన ‘దేవదాస్‌’ అనే మల్టీస్టారర్‌ చిత్రం. ఈ చిత్రాన్ని అరవింద సమేత చిత్రం విడుదలైన వారం పది రోజుల్లో విడుద చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవదాస్‌తో పాటు ఇంకా రెండు మూడు ప్రముఖ చిత్రాలు కూడా దసరా కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు. రామ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం హలో గురు ప్రేమకోసమే చిత్రాన్ని దసరాకు విడుదల చేయబోతున్నారు. రవితేజ, శ్రీనువైట్ల కాంబోలో రూపొందోతున్న అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రాన్ని కూడా దసరాకు విడుదల చేయాలని నిర్ణయించారు. శర్వానంద్‌ చిత్రం కూడా దసరకు విడుదల కాబోతుంది. ఇలా వరుసగా పలు చిత్రాలు దసరాకు విడుదల కాబోతున్న నేపథ్యంలో దసరా పోటీ భారీగా పెరుగుతుంది. చిన్నా, పెద్దా కలిసి దాదాపు అరడజను చిత్రాలు దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.