బ్యాడ్‌ టైంలో ఆచారి యాత్

Manchu Vishnu Achary America Yatra Movie Relese On 5th April

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మంచు విష్ణు హీరోగా నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం గత రెండున్నర నెలలుగా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ఈ చిత్రం విడుదలకు తేదీని ప్రకటించారు. మొదట ఈ చిత్రంను సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. పెద్ద చిత్రాలతో పోటీ ఎందుకులే అనే ఉద్దేశ్యంతో వాయిదా వేశారు. ఆ తర్వాత రిపబ్లిక్‌ డేకు విడుదల చేస్తామని ప్రకటించారు. కాని రిపబ్లిక్‌ డే కు కూడా పెద్ద సినిమాలు ఉన్న నేపథ్యంలో విడుదల వాయిదా వేశారు. ఆ తర్వాత వరుసగా వాయిదాలు వేస్తూ వచ్చిన యూనిట్‌ సభ్యులు తాజాగా ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

మార్చి చివర్లో రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘రంగస్థలం’ విడుదలైన వారం లోపే మంచు విష్ణు తన సినిమాను విడుదల చేయడం పెద్ద సాహనం అని చెప్పాలి. ఇన్నాళ్లు ఆగిన మంచు విష్ణు ఇప్పుడు పెద్ద సినిమాల నడుమ విడుదల చేయడంను తప్పుడు నిర్ణయంగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భరత్‌ అను నేను, కాలా ఇంకా పలు చిత్రాలు కూడా ఏప్రిల్‌లో విడుదల కాబోతున్నాయి. ఇలాంటి సమయంలో మంచు విష్ణు తన సినిమాను తీసుకు రావడం వల్ల సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా కూడా కలెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉండదని డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా వాయిదా వేయాలని పలువురు విష్ణుకు సూచిస్తున్నారు. మరి ఆచారి తన యాత్రను వాయిదా వేసుకుంటాడేమో చూడాలి.