ఈవారం కూడా ఒక్కటి మెప్పించలేదు

films doesn’t well be at box office in March 3rd week

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కొత్త సంవత్సరం పాతబడిపోతుంది, మూడు నెలలు పూర్తి అవుతున్నా కూడా 2018లో ఒక్క సూపర్‌ హిట్‌ పడినది లేదు. సంవత్సరం ఆరంభంలో ‘అజ్ఞాతవాసి’, ‘జైసింహా’, ‘భాగమతి’, ‘టచ్‌ చేసి చూడు’ ఇలా పెద్ద సినిమాలు ఘోరంగా ఫ్లాప్‌ అవ్వడంతో అప్పటి నుండి కంటిన్యూగా ఫ్లాప్‌లు పడుతూనే ఉన్నాయి. పరీక్షల సీజన్‌ అవ్వడంతో గత నాలుగు వారాలుగా పెద్ద సినిమాల విడుదల లేదు. అంతకు ముందు బంద్‌ కారణంగా ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకుండా పోయింది. ఇలా మూడు నెలలుగా తెలుగు ప్రేక్షకులు మాంచి కమర్షియల్‌ సినిమా రాకా అల్లాడి పోతున్నారు. తాజాగా ఈ వారంలో కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు సినిమాలు విడుదల అయ్యాయి.

నిన్న విడుదలైన అయిదు సినిమాల్లో నిఖిల్‌ నటించిన ‘కిర్రాక్‌ పార్టీ’ చిత్రంపై కాస్త అంచనాలున్నాయి. కాని ఆ అంచనాలను నిఖిల్‌ అందుకోలేక పోయాడు. నిఖిల్‌ విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అంటూ వచ్చిన వార్తలు నిజం కాలేదు. తాజాగా మరోసారి వారాంతం వృదా అయ్యిందని చెప్పుకోవాలి. నిన్న ‘కిర్రాక్‌ పార్టీ’తో పాటు విడుదలైన ‘దండుపాళ్యం 3’, ‘ఐతే 2’, ‘కర్తవ్యం’, ‘నెల్లూరి పెద్దారెడ్డి’ చిత్రాలు సో సోగానే ఉన్నాయి.

కర్తవ్యం సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా అది ఒక డబ్బింగ్‌ సినిమా అవ్వడంతో పాటు, లేడీ ఓరియంటెడ్‌ చిత్రం అవ్వడంతో తెలుగు ప్రేక్షకులు ఆధరిస్తారనే నమ్మకం లేదు. మరో వారం రోజుల పాటు ఎదురు చూపులు తప్పవు. వచ్చే వారం అయినా మంచి సినిమాలు వస్తాయో చూడాలి. ఆ వారం కూడా వృదా అయితే ఆ తర్వాత వారంలో చరణ్‌ ‘రంగస్థలం’తో దిగబోతున్నాడు. 2018లో మొదటి కమర్షియల్‌ సక్సెస్‌ రంగస్థలం అవ్వడం ఖాయం అనే నమ్మకంను సినీ వర్గాల వారు మరియు మెగా ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు.