బాహుబ‌లిక‌న్నా గొప్ప‌గా ఉంటుంది

Tanaji Unsung Warrior Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

 దేశంలో ఇప్పుడు ఏ భారీ చిత్రం వ‌స్తున్నా…దాన్ని బాహుబలితోనే పోల్చిచూస్తున్నారు ప్రేక్ష‌కులు. తెలుగు సినిమా స‌త్తాను జాతీయ స్థాయిలో చాటిన బాహుబ‌లి బాలీవుడ్ లోనూ ఓ ప్ర‌భంజ‌నం సృష్టించింద‌ని చెప్పొచ్చు. క‌లెక్ష‌న్ల ప‌రంగానూ, సాంకేతికతంగానూ త‌మ సినిమాల కన్నా బాహుబ‌లి టాప్ రేంజ్ లో ఉండ‌టం చూసి బాలీవుడ్ బ‌డాహీరోల‌కు నోట మాట రాలేదు. ఇక హిందీ ప్రేక్ష‌కుల‌క‌యితే  పెద్ద సినిమా ఏది రిలీజ‌యినా…బాహుబ‌లి తో పోల్చిచూడ‌టం ప‌రిపాటి అయింది.  నిర్మాణ ద‌శ‌లో ఉన్న భారీ చిత్రాలూ ఇందుకు మిన‌హాయింపు కాదు.

సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కిస్తున్న ప‌ద్మావ‌తి, అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా న‌టిస్తున్న తానాజీః అన్ సంగ్ వారియ‌ర్ ను బాలీవుడ్ ప్రేక్ష‌కులు ఇప్పుడు బాహుబ‌లితో పోల్చుకుంటున్నారు. ప‌ద్మావ‌తి, తానాజీ రెండూ బాహుబ‌లిలానే రాజుల కాలం నాటి చిత్రాలు. అయితే ఈ రెండు సినిమాలు బాహుబ‌లిలా క‌ల్పిత క‌థ కాకుండా …య‌దార్థ జీవితాల‌కు సంబంధించిన సినిమాలు. ప‌ద్మావ‌తి చిత్తోర్ రాణి ప‌ద్మిణి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతోంటే…తానాజీః ది అన్ సంగ్ వారియ‌ర్ ఛ‌త్ర‌ప‌తి శివాజీ సైన్యంలో సేనాధిప‌తిగా వ్య‌వ‌హరించిన సుబేదార్ తానాజీ మ‌లుస‌రే జీవిత‌క‌థ‌.

ఈ చ‌రిత్రాత్మ‌క సినిమాలు రెండింటి టార్గెట్ బాహుబలిని మించి క‌లెక్ష‌న్లు, పేరు తెచ్చుకోవ‌ట‌మే అని బాలీవుడ్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ ప్ర‌చారాన్ని తానాజీ పాత్ర పోషిస్తున్న అజ‌య్ దేవ‌గ‌న్ ఖండిస్తున్నాడు. తాము బాహుబ‌లితో పోటీప‌డ‌టం లేదని, అంత‌క‌న్నా గొప్ప‌స్థాయిలో తానాజీని తెర‌కెక్కించాల‌నుకుంటున్నామ‌ని అజ‌య్ దేవ‌గ‌న్ చెప్పుకొచ్చారు. అజ‌య్ చెప్పిందే నిజ‌మైతే ప్రేక్ష‌కుల‌కు అంత‌క‌న్నా కావ‌ల్సింది ఏముంటుంది? వెండితెర అద్భుతంగానిలిచిన ఓ చిత్రం కంటే మంచి చిత్రం చూపిస్తామంటే వ‌ద్ద‌నేదెవ‌రు?

మరిన్ని వార్తలు:

సాహోలో మందిరాబేడీ

వ‌ర్మ త‌రువాత రాజ‌మౌళి