వ‌ర్మ త‌రువాత రాజ‌మౌళి

Rajamouli praises Arjun Reddy director Sandeep Reddy Vanga

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విజ‌య్ దేవ‌రకొండ హీరోగా సందీప్ రెడ్డి తెర‌కెక్కించిన అర్జున్ రెడ్డి టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయింది. సాధార‌ణ ప్రేక్ష‌కులే కాదు… టాప్ సెల‌బ్రిటీలు అర్జున్‌రెడ్డికి ఫిదా అయిపోతున్నారు. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ వీలు కుదిరిన‌ప్పుడ‌ల్లా అర్జున్ రెడ్డిని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతుంటే… ఇప్పుడు ఆ జాబితాలో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి చేరాడు.  అర్జున్ రెడ్డిపై ట్విట్ట‌ర్ లో ఆయ‌న  ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. తాను ఇవాళ అర్జున్ రెడ్డి సినిమా చూశాన‌ని, విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న అద్భుత‌మ‌ని,  అర్జున్ క్యారెక్ట‌ర్ లో జీవించాడ‌ని రాజ‌మౌళి ప్ర‌శంసించారు.

హీరోతో పాటు హీరోయిన్ షాలిని, ఇత‌ర న‌టులు కూడా చాలా నేచుర‌ల్ గా న‌టించార‌ని కొనియాడారు. సినిమాలో డైలాగులు అద్భుతంగా ఉన్నాయ‌ని, డైరెక్ట‌రు అద్భుత‌రీతిలో సినిమాను తెర‌కెక్కించాడ‌ని  పొగడ్త‌ల జ‌ల్లు కురిపించారు. సినిమా క్రెడిట్ అంతా ద‌ర్శ‌కుడిదే అని, చిత్ర‌బృందాన్ని చ‌క్క‌గా హ్యాండిల్ చేయ‌గ‌లిగాడ‌ని జ‌క్క‌న్న మెచ్చుకున్నారు.  ప్రేమ క‌థ‌లు తెర‌కెక్కించ‌డం త‌న‌వ‌ల్ల కాద‌ని, అయినా ఈసినిమాను ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేను అని జ‌క్క‌న్న వ్యాఖ్య‌చానించారు. బ్లాక్ బ్ల‌స్ట‌ర్ విజ‌యాన్ని అందుకున్న అర్జున్ రెడ్డి టీమ్ కు అభినంద‌న‌లు అని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. అటు సినిమా ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌నే కాదు…రాజ‌కీయ‌వేత్త‌ల‌నూ అర్జున్ రెడ్డి  ఆక‌ట్టుకుంటోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అర్జున్ రెడ్డి సినిమా చాలా బాగుంద‌ని ప్ర‌శంసించారు.

మరిన్ని వార్తలు:

‘హలో’ వెనుక స్టోరీ ఇది

సన్నీలియోన్‌పై వింత ఫిర్యాదు

తమిళ బాహుబలి అటకెక్కిందా?