తమిళ బాహుబలి అటకెక్కిందా?

sanghamithra-movie-projectect-terminated

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘బాహుబలి’ చిత్రం తర్వాత సౌత్‌లో భారీ బడ్జెట్‌ చిత్రాలు వరుసగా తెరకెక్కుతాయని అంతా భావించారు. అనుకున్నట్లుగానే పలు భారీ బడ్జెట్‌ చిత్రాలను ప్రముఖ నిర్మాతలు ప్రకటించారు. తమిళంలో ‘సంఘమిత్ర’ చిత్రం బాహుబలి స్థాయిలో తెరకెక్కించబోతున్నట్లుగా ప్రకటించారు. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ఆ సినిమాను రూపొందించేందుకు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి అయ్యిందని, సినిమాలో నటించేందుకు నటీ నటులకు విదేశాల్లో ట్రైనింగ్‌ను కూడా ఇప్పించడం జరిగింది. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో షూటింగ్‌ మరికొన్ని రోజుల్లో ప్రారంభం అవ్వనున్న నేపథ్యంలో సినిమా నుండి హీరోయిన్‌ శృతిహాసన్‌ తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. 

శృతిహాసన్‌ తప్పుకున్న సమయంలో సినిమా గురించి కాస్త సందడి నెలకొంది. ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్ర ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మొత్తానికి తెగ హంగామా చేసిన ‘సంఘమిత్ర’ టీం ఇప్పుడు సైలెంట్‌ అయ్యింది. దాదాపు రెండు మూడు నెలలుగా తమిళ మీడియాలో ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు. దాంతో సినిమా తాత్కాలికంగా ఆగిపోయింది లేదా సినిమా మొత్తాన్ని ఏదో కారణం వల్ల అటకెక్కించారు అనే టాక్‌ తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. బాహుబలికి ఏమాత్రం తగ్గకుండా అద్బుతమైన పోరాట సన్నివేశాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ను ఈ చిత్రంలో చూపుతామని బింకాలు పలికిన మేకర్స్‌ ఇప్పుడు సినిమానే తీసుకు వచ్చే పరిస్థితి లేదని తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు. అసలు సినిమా పోగ్రెస్‌ గురించి చిత్ర యూనిట్‌ సభ్యులు మీడియా ముందుకు వచ్చి తెలియజేయాలని కొందరు కోరుతున్నారు. కొందరు మాత్రం సినిమా షూటింగ్‌ చాపకింద నీరులా సాగుతుందని, లో ఫ్రొఫైల్‌ మెయింటెన్‌ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏది నిజమో తెలియాలంటే వారు స్పందించాల్సిందే.

మరిన్ని వార్తలు:

అర్జున్‌ రెడ్డి తర్వాత అల్లు అర్జున్‌?

బాలయ్యను బ్యాడ్‌ చేస్తున్నాడు

ఎన్టీఆర్‌కు నాగ్‌ ప్రశంసలు

తమిళ బాహుబలి అటకెక్కిందా? - Telugu Bullet