ఎన్టీఆర్‌కు నాగ్‌ ప్రశంసలు

Nagarjuna praises to Jr NTR

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగు బుల్లి తెరపై ప్రస్తుతం బిగ్‌బాస్‌ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్‌ గురించి ఏ రేంజ్‌లో మాట్లాడుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు లేనిది స్టార్‌ మాటీవీని అమాంతం రేటింగ్‌ విషయంలో ఎక్కడో తీసుకు వెళ్లి కూర్చోబెట్టింది. ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌ ఏవీ కూడా స్టార్‌ మాటీవీతో పోటీ పడలేనంతగా ఈ షో నడుస్తుంది అంటే ఎన్టీఆర్‌ గొప్పదనంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేస్తున్న కారణంగానే ఈ షోకు ఇంత ఆధరణ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఎన్టీఆర్‌పై అంతా కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా నాగార్జున కూడా తనకు ఆప్తుడు అయిన ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించాడు.

ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌ షోపై నాగార్జున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుల్లి తెరపై ప్రేక్షకులను అలరించడం అంత సులభం కాదు. వెండి తెరపై కంటే బుల్లి తెరపై కనిపించడం చాలా కష్టం. ఆ అనుభవం నాకు ఉంది కనుక చెబుతున్నాను. ఎన్టీఆర్‌ అద్బుతంగా షోను హోస్ట్‌ చేస్తున్నాడు, ఎంతో కష్టమైన పనిని ఎన్టీఆర్‌ చాలా అవలీలగా చేసేస్తున్నాడు. ఎన్టీఆర్‌పై నాకు మొదటి నుండి నమ్మకం ఉంది. ఆ నమ్మకంను నిలుపుకున్నాడంటూ ఎన్టీఆర్‌పై నాగార్జున పొగడ్తల వర్షం కురిపించాడు. నాగార్జున తాజాగా ‘రాజుగారి గది 2’ చిత్రాన్ని చేయడం జరిగింది. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది. సమంత ఒక కీలకమైన రోల్‌లో నటించింది. ఓంకార్‌ దర్శకత్వంలో ప్రసాద్‌ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు.

మరిన్ని వార్తలు:

నాని.. ఇప్పుడు అది వద్దు ప్లీజ్‌

బండ్ల గణేష్‌ సీరియస్‌ వార్నింగ్‌

మాఫియా డాన్ గా శ‌ర్వానంద్