బండ్ల గణేష్‌ సీరియస్‌ వార్నింగ్‌

director-bandula-ganesh-strong-warning-to-kathi-mahesh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌కు నటన రాదు, రాజకీయాలు తెలవదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే. కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలకు సీరియస్‌ అయిన పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ చాలా వైల్డ్‌గా రియాక్ట్‌ అవుతున్నారు. కత్తి మహేష్‌కు కంటిన్యూస్‌గా కాల్స్‌ వెళ్తూనే ఉన్నాయి, వాట్సప్‌కు అశ్లీల మెసేజ్‌లు పీకే ఫ్యాన్స్‌ అంటూ పంపిస్తున్నారు. పవన్‌ ఫ్యాన్స్‌ టార్చర్‌ ఎక్కువ అయ్యిందంటూ ఇటీవల మళ్లీ ఒక ఛానెల్‌లో కత్తి మహేష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. పవన్‌ తనకు ఆయన ఫ్యాన్స్‌ తరపున క్షమాపణలు చెప్పాలిందే అంటూ డిమాండ్‌ చేసిన నేపథ్యంలో పవన్‌కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్‌ చాలా సీరియస్‌గా స్పందించాడు. 

పవన్‌పై ఈగ వాలినా కూడా చూస్తూ ఊరుకోలేని బండ్ల గణేష్‌ గతంలో పలు సందర్బాల్లో పవన్‌ కళ్యాణ్‌ కోసం పలువురితో తగవు పెట్టుకున్న సందర్బాలున్నాయి. తాజాగా బండ్లగణేష్‌ ట్విట్టర్‌ ద్వారా కత్తి మహేష్‌కు చాలా సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ట్విట్టర్‌లో తెలుగులో చిన్న లైన్‌ను బండ్ల గణేష్‌ పోస్ట్‌ చేశాడు. అదేంటి అంటే… తమ్ముడు కత్తి మహేష్‌… సూర్యుడి వైపు చూడకు, ఆ సూర్య కిరణాలమైన మాలాంటి వారిచే మాడి మసైపోతావు అంటూ చాలా సీరియస్‌గా హెచ్చరించాడు. పవన్‌పై ఇలాగే వ్యాఖ్యలు కంటిన్యూ అయితే కత్తి మహేష్‌ పరిస్థితి మరో లెవల్‌కు వెళ్లడం ఖాయం అని కొందరు పీకే ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలోనే హెచ్చరిస్తున్నారు. మరి ఇప్పటి నుండైనా కత్తి మహేష్‌ కాస్త జాగ్రత్తగా మాట్లాడతాడేమో చూడాలి.

మరిన్ని వార్తలు:

మాఫియా డాన్ గా శ‌ర్వానంద్

నాగార్జున రాజు గారి గది 2 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్…

ఈసారి ఎన్టీఆర్‌ కోసం…