ఈసారి ఎన్టీఆర్‌ కోసం…

tamanna item song in NTR jai lava kusa movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటించిన ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ చిత్రాల్లో తమన్నా ఐటెం సాంగ్‌ చేసి మెప్పించింది. ఆ సినిమాల్లోనే కాకుండా ఇంకా పలు ఐటెం సాంగ్స్‌ను ఈ అమ్మడు చేసిన విషయం తెల్సిందే. ‘బాహుబలి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమా చేసిన తర్వాత కూడా ఈ అమ్మడికి తెలుగులో హీరోయిన్‌గా పెద్దగా ఆఫర్లు రావడం లేదు. దాంతో అటు బాలీవుడ్‌, ఇటు కోలీవుడ్‌లో ఛాన్స్‌ల కోసం తాపత్రయ పడుతోంది. ఎట్టకేలకు తెలుగు నుండి ఈమెకు అవకాశం దక్కింది. అది కూడా ఎన్టీఆర్‌తో కలిసి డాన్స్‌ వేసే అవకాశం ఈ అమ్మడు దక్కించుకుంది.

ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో నటిస్తున్న ‘జై లవకుశ’ చిత్రం ప్రస్తుతం ఐటెం సాంగ్‌ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఆ ఐటెం సాంగ్‌ చిత్రీకరణలో ఎన్టీఆర్‌తో కలిసి తమన్నా స్టెప్పులు వేస్తోంది. ఎన్టీఆర్‌తో గతంలో నటించిన తమన్నా ఈసారి ఐటెం సాంగ్‌ చేస్తోంది. ఎన్టీఆర్‌ తన గత చిత్రం ‘జనతా గ్యారేజ్‌’లో కాజల్‌తో ఐటెం సాంగ్‌ చేయించాడు. పక్కా లోకల్‌ సాంగ్‌ ఎంత పాపుర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే తరహాలో ‘జై లవకుశ’ ఐటెం సాంగ్‌ కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. తమన్నా హాట్‌ అందాలతో ఐటెం సాంగ్‌ అదిరి పోవడం ఖాయం అని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్టీఆర్‌కు జోడీగా రాశిఖన్నా మరియు నివేదా థామస్‌లు నటిస్తున్న విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు:

ఆ వార్తపై రానా క్లారిటీ

గిరిజ‌, స‌మంత లాంటి హీరోయిన్ కావాలి

ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌న్నా విజ‌య్ దేవ‌ర‌కొండ బెట‌ర్