ఆ వార్తపై రానా క్లారిటీ

rana-daggubati-clarity-about-bollywood-or-kollywood-entire

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘లీడర్‌’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా బాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇటీవల ‘బాహుబలి’ చిత్రంతో తెలుగుతో పాటు దేశ వ్యాప్తంగా రానాకు భారీ గుర్తింపు వచ్చింది. ‘బాహుబలి’ తర్వాత ‘ఘాజీ’ మరియు ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాలతో రానా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌ హిట్స్‌ను అందుకున్నాడు. ముఖ్యంగా ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో కమర్షియల్‌గా బిగ్‌ సక్సెస్‌ను రానా అందుకున్నాడు. రానా ఇప్పటి వరకు తన తర్వాత సినిమాకు కమిట్‌ అయ్యింది లేదు. ఈ సమయంలోనే రానా బాలీవుడ్‌ లేదా కోలీవుడ్‌ వెళ్లబోతున్నట్లుగా వార్తలు జోరుగా వస్తున్నాయి.

ఇదే విషయాన్ని రానానే నేరుగా ట్విట్టర్‌ ద్వారా ఒక అభిమాని ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నకు రానా ఒకే మాటతో సమాధానం చెప్పేశాడు. తాను ఏ భాషకు వెళ్లినా కూడా తెలుగు నుండే వెళ్తాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంటే తెలుగులో సినిమాలు చేసి వాటిని డబ్‌ చేసి ఇతర భాషల్లోకి తీసుకు వెళ్తాను అంటూ చెప్పుకొచ్చాడు. తెలుగులో ‘ఘాజీ’, ‘నేనే రాజు నేనే మంత్రి’ మంచి సక్సెస్‌లు వచ్చిన తర్వాత రానా ఎక్కడకు వెళ్తాడు. ఇక్కడ మరిన్ని సినిమాలు చేస్తాడు. అయితే ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఆ రేంజ్‌లోనే తన తర్వాత సినిమా ఉండాలనే ఉద్దేశ్యంతో కాస్త గ్యాప్‌ తీసుకుని ఉంటాడు అనే టాక్‌ వినిపిస్తుంది. అదే నిజం అవ్వాలని, ఆయనకు మరో సక్సెస్‌ రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు:

నరసింహారెడ్డి పొగరు చూపుతున్న లీక్‌ డైలాగ్‌

పవన్‌25 గురించి ఒక పుకారు.. నిజమైతే ఫ్యాన్స్‌కు షాక్‌

అల్లరోడు ఈసారి కూడా కష్టమేనా?