పవన్‌25 గురించి ఒక పుకారు.. నిజమైతే ఫ్యాన్స్‌కు షాక్‌

bad news for pawan kalyan fans about first look

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పవన్‌ కళ్యాణ్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం ఫస్ట్‌లుక్‌ను వచ్చే నెల 2న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. పవన్‌ పుట్టిన రోజు సందర్బంగా త్రివిక్రమ్‌ ఫ్యాన్స్‌కు గిఫ్ట్‌ ఇచ్చేందుకు సిద్దం అవుతున్న సమయంలో సోషల్‌ మీడియాలో కొందరు పవన్‌ 25వ చిత్రం ఫస్ట్‌లుక్‌ చెప్పిన టైంకు విడుదల చేయడం లేదని, కొన్ని కారణాల వల్ల ఆలస్యం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. టైటిల్‌పై ఇంకా స్పష్టత రాని నేపథ్యంలో త్రివిక్రమ్‌ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

సినీ వర్గాల నుండి ఈ విషయమై ఎలాంటి సమాచారం లేదు. చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ముందుగా ప్రకటించిన తేదీకి అంటే పవన్‌ పుట్టిన రోజున ఫస్ట్‌లుక్‌ వచ్చి తీరుతుంది అంటూ చెబుతున్నారు. నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. అందుకే పుకార్ల వెనుక ఏదో నిజం ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి పవన్‌ పుట్టిన రోజు కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్‌ న్యూస్‌ అని చెప్పుకోవచ్చు. ఈ పుకారు నిజం కావద్దని అంతా కోరుకుంటున్నారు. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్‌కు జోడీగా కీర్తి సురేష్‌ మరియు అను ఎమాన్యూల్‌లు నటిస్తున్నారు. ‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత పవన్‌, త్రివిక్రమ్‌ల కాంబో మూవీ అవ్వడంతో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రికార్డు స్థాయిలో జరుగుతుంది.

మరిన్ని వార్తలు:

అల్లరోడు ఈసారి కూడా కష్టమేనా?

పరుగెత్తే ప్ర‌తివాడూ పారిపోతున్నట్టు కాదు

కత్తి మహేష్‌ వ్యాఖ్యలపై పవన్‌ స్పందన?