అల్లరోడు ఈసారి కూడా కష్టమేనా?

There is no interest in the audience on the Allari Naresh's 'Meda Meeda Abbayi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇతడు హీరోగా ఎలా పనికి వస్తాడు అంటూ ‘అల్లరి’ చిత్రం వచ్చినప్పుడు షాక్‌ అయ్యారు. ఆ సినిమా తర్వాత నరేష్‌ కాస్త అల్లరి నరేష్‌ అయ్యాడు, అప్పటి నుండి కొన్ని సంవత్సరాల పాటు వెనుదిరిగి చూసుకోకుండా వరుసగా మంచి సినిమాలను చేస్తూ వచ్చాడు. ఎన్నో పాత్రల్లో నటించి నవ్వించడంతో పాటు, కొన్ని సినిమాల్లో ఏడిపించాడు. అల్లరి నరేష్‌ సినిమా అంటే మినిమం గ్యారెంటీ సక్సెస్‌ అనే టాక్‌ ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గత రెండు మూడు సంవత్సరాలుగా కూడా అల్లరోడికి సరైన సక్సెస్‌ పడలేదు. తాజాగా ఆయన చేసిన చిత్రం ‘మేడ మీద అబ్బాయి’. ఈ సినిమాపై అల్లరోడు చాలా ఆశలు పెట్టుకున్నాడు. 

అల్లరి నరేష్‌ నటించిన ‘మేడ మీద అబ్బాయి’ చిత్రం వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రారంభం అయినప్పటి నుండి కూడా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేదు. సినిమా విడుదలకు దగ్గరపడ్డా కూడా ఇంకా ప్రేక్షకులు ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం లేదు. ఇటీవలే విడుదలైన టీజర్‌ మరియు ట్రైలర్‌లు కూడా అల్లరోడి గత ఫ్లాప్‌ చిత్రాల ఫార్మట్‌లోనే ఈ సినిమా ఉంటుందేమో అనే అనుమానంను కలిగిస్తున్నాయి. ఆ కారణంగా కూడా ‘మేడ మీద అబ్బాయి’ని పట్టించుకునే నాదుడు కరువయ్యాడు. సినిమా విడుదల తర్వాత పాజిటివ్‌ టాక్‌ వస్తే తప్ప ఈ సినిమా నిలబడటం కష్టంగా ఉంది. పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా అదే వారంలో మరికొన్ని ముఖ్యమైన పెద్ద సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో మేడమీద అబ్బాయిని పట్టించుకుంటారా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాపం అల్లరోడికి ఈ సినిమా అయినా సక్సెస్‌ను తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు:

కత్తి మహేష్‌ వ్యాఖ్యలపై పవన్‌ స్పందన?

అర్జున్‌ రెడ్డిపై సమంత కామెంట్స్‌

భోగ‌న్ రీమేక్ లో మాస్ మ‌హారాజ‌