అర్జున్‌ రెడ్డిపై సమంత కామెంట్స్‌

Samantha appreciates Vijay Deverakonda's Arjun Reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే జంటగా సందీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై మొదటి నుండి కూడా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంది. యూత్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌ మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అవ్వడంతో పాటు, ప్రేమ సన్నివేశాలు అదరహో అన్నట్లుగా ఉన్నాయి. ఈ సినిమాకు సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని స్టార్‌ హీరోయిన్‌ సమంత చూసి తన కామెంట్స్‌ను ట్విట్టర్‌ ద్వారా ఇచ్చింది. 

ట్విట్టర్‌లో సమంత ‘అర్జున్‌ రెడ్డి’ గురించి మాట్లాడుతూ.. ‘అర్జున్‌ రెడ్డి’ ఒక అద్బుతమైన చిత్రం, చాలా కాలం తర్వాత నేను చూసిన ఒక సహజసిద్దమైన చిత్రం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇటీవల వరుసగా మంచి సినిమాలు వస్తున్న నేపథ్యంలో మంచి రోజులు వచ్చాయి అంటూ  సమంత  ట్వీట్‌ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో భారీ వసూళ్లను రాబట్టుతున్న ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ స్థాయి అమాంతం పెరిగిపోయింది. షాలిని పాండే నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ సంవత్సరం టాప్‌ చిత్రాల జాబితాలో ఇది చేరి పోవడం ఖాయం.

మరిన్ని వార్తలు:

భోగ‌న్ రీమేక్ లో మాస్ మ‌హారాజ‌

సైరాలో మరి కొందరు స్టార్స్‌ కూడా..!

ఓ ప్రాంతానికి ఒకే వినాయ‌క మండ‌పం