సైరాలో మరి కొందరు స్టార్స్‌ కూడా..!

few-more-guest-roles-in-megastar-chiranjeevi-syeraa-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ఆయన 151వ సినిమాపై ఫుల్‌ పిక్చర్‌ను విడుదల చేయడం జరిగింది. సినిమాలో హీరోయిన్‌ ఎవరు, ముఖ్య నటీనటులు ఎవరు అనే విషయంపై క్లారిటీ వచ్చింది. సినిమాను బాలీవుడ్‌ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నట్లుగా టెక్నీషియన్స్‌ మరియు నటీనుటులను చూస్తుంటే అనిపిస్తుంది. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తెలుగులో ‘బాహుబలి’ తర్వాత స్థానంను ఆక్రమించడం ఖాయం అని ఇప్పటికే తేలిపోయింది. హీరోయిన్‌గా నయనతార ముఖ్య పాత్రల్లో అమితాబచ్చన్‌, కిచ్చ సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్స్‌ నటించబోతున్నారు. వీరితో పాటు కొందరు గెస్ట్‌ రోల్స్‌ చేయబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. 

ముందు నుండి అనుకుంటున్నట్లుగా ఈ చిత్రంలో అనుష్క ఒక కీలకమైన గెస్ట్‌ రోల్‌ను చేయబోతుంది. ఆ విషయం అనుష్క సన్నిహితుల ద్వారా మీడియాకు తెలిసింది. అనుష్క పాత్ర ఏంటి, ఆమె ఎంత సమయం స్క్రీన్‌పై కనిపించనుంది అనే విషయాలు తెలియలేదు, కాని అనుష్క మాత్రం ఖచ్చితంగా సైరా చిత్రంలో ఉండనుందని వారు చెబుతున్నారు. కొన్ని పాత్రలను గోప్యంగా ఉంచి, సినిమా విడుదల సమయంలో ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేయాలని చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ కలెక్షన్స్‌ను క్రాస్‌ చేయడం సైరా లక్ష్యంగా మెగా ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

అర్జున్‌ రెడ్డి ఎఫెక్ట్‌.. శర్వా ఓకే

జైలవకుశ సందడి షురూ

క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న త‌మ‌న్నా