అర్జున్‌ రెడ్డి ఎఫెక్ట్‌.. శర్వా ఓకే

arjun-reddy-director-sandeep-vangas-next-film-with-sharwanand

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యూత్‌ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేసి సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కలెక్షన్స్‌ను రాబడుతుంది. మొదటి వారాంతంలోనే సినిమాకు పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేలా ఉంది. ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్‌ రెడ్డితో సినిమాలు చేసేందుకు యువ హీరోలు పోటీ పడుతున్నారు. ‘అర్జున్‌ రెడ్డి’ కథను విజయ్‌ దేవరకొండకు ముందు పలువురు యువ హీరోలకు వినిపించాడు దర్శకుడు. కాని శర్వానంద్‌ మాత్రం కథను మెప్పి నటించేందుకు ముందుకు వచ్చాడు. కాని కొన్ని కారణాల వల్ల శర్వానంద్‌ ఆలస్యం అయ్యింది. 

శర్వానంద్‌ ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో అర్జున్‌ రెడ్డిని విజయ్‌ దేవరకొండతో తెరకెక్కించాడు. అర్జున్‌ రెడ్డి భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా శర్వానంద్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డికి ఫోన్‌ చేసి మరీ కథ సిద్దం చేయమని, త్వరలో సినిమా చేద్దాం అంటూ సూచించాడట. ఇప్పటికే తన వద్ద ఉన్న కథల నుండి ఒక కథను దర్శకుడు సందీప్‌ రెడ్డి శర్వాకు వినిపించినట్లుగా తెలుస్తోంది. ఆ కథతో సినిమాను మొదలు పెట్టేందుకు శర్వా ఓకే చెప్పాడు. శర్వానంద్‌ హీరోగా తాజాగా మారుతి దర్శకత్వంలో ‘మహానుభావుడు’ చిత్రం తెరకెక్కింది. ఆ సినిమాకు సంబంధించిన టీజర్‌ ఇటీవలే విడుదలై సినిమాపై అంచనాలు పెంచేసింది. దసరాకు ఆ సినిమా రాబోతుంది. ఆ సినిమా విడుదలైన తర్వాత శర్వానంద్‌, సందీప్‌ రెడ్డిల కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు:

పెళ్లి తర్వాత చై, సామ్‌లను కలుపబోతున్న మారుతి?

మేడ మీద అబ్బాయి ట్రైలర్ లో అల్లాడించాడు…