చిన్మయి మీద పడ్డ పవన్‌ ఫ్యాన్స్‌

pawan fans targeting singer chinmayi on renu desai fb post issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెల్సిందే. తమ అభిమాన నాయకుడి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, ఎవరైనా కించపర్చినట్లుగా వ్యవహరించినా కూడా చాలా దారుణమైన పదజాలంతో పవన్‌ ఫ్యాన్స్‌ వారిని ట్రోల్‌ చేస్తూ ఉంటారు. ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ రెండవ పెళ్లి చేసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించింది. పవన్‌తో విడాకులు తీసుకున్న ఆమె ఇన్నాళ్లకు ఒంటరితనం భరించలేక రెండవ పెళ్లి చేసుకోవాలని భావిస్తుంటే పవన్‌ ఫ్యాన్స్‌ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. రేణుదేశాయ్‌ ఎప్పటికైనా పవన్‌కు మాత్రమే భార్య అని, ఆమె పవన్‌కు మాజీ భార్యగానే ఉండాలి తప్ప మరొకరికి భార్య అయ్యేందుకు తాము ఒప్పుకోము అంటూ కొందరు సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు.

రేణుదేశాయ్‌ పట్ల పవన్‌ ఫ్యాన్స్‌ వ్యవహరిస్తున్న తీరును కొందరు తప్పుబడుతున్నారు. ఒకరి వ్యక్తిగత విషయాల గురించి ఇలా మాట్లాడటం సరికాదని, అభిమానం హద్దులు దాటితే అందరికి మంచిది కాదు అంటూ హింతవు పలుకుతున్నారు. తాజాగా సమంతకు డబ్బింగ్‌ చెప్పే చిన్మయి కూడా రేణుదేశాయ్‌కి మద్దతుగా మాట్లాడటం జరిగింది. ఒక మహిళ తన భావాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నంత మాత్రాన ఆమెను కించపర్చేలా మాట్లాడటం ఏమాత్రం మంచి పద్దతి కాదు అంటూ పవన్‌ ఫ్యాన్స్‌కు గడ్డి పెట్టే ప్రయత్నం చేసింది. దాంతో ఆమెపై కూడా పవన్‌ ఫ్యాన్స్‌ విరుచుకు పడుతున్నారు.

సుచిలీక్స్‌ పేరును బయటకు తీసుకు వచ్చి మరీ సింగర్‌ చిన్మయిని దారుణంగా ట్రోల్‌ చేస్తూ పవన్‌ ఫ్యాన్స్‌ కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. పవన్‌ ఫ్యాన్స్‌ తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. నాకు ఏదైనా చెప్పాలనుకుంటే మంచి పద్దతిలో, మంచి మాటలతో చెప్పండి. ఖచ్చితంగా నేను తప్పు చేశాను అనుకుంటే మార్చుకుంటాను. కాని ఇలా ట్రోల్‌ చేయడం వల్ల ఫలితం ఏంటని ఆమె పవన్‌ ఫ్యాన్స్‌ తీరును తప్పుబట్టింది.