బీజేపీ ఓటమి తప్పదు : అయోధ్య పూజారి శాపనార్థాలు !

Ram Janmabhoomi Temple Chief Priest warns on bjp party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బీజేపీకి వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పేలా లేవు. ఒకవైపు తనతో నడిచిన మిత్రపక్షాల్ని పట్టించుకోక పోవడంతో వారందరూ ఏకమయి ఇప్పటికే కొన్ని రాష్ట్ర ఎన్నికల్లో షాక్ ఇవ్వగా ఇప్పుడు జ్ఞానోదయం అయిన షా ఇప్పుడు ఆ మిత్ర పక్షాల వెంట పడటం మొదలు పెట్టారు. ఇక ధరల పెంపు, నోట్ల రద్దు విషయాల్లో ప్రజాగ్రహం కూడా ఎదురుకుంటున్న భాజపాకి ఇప్పుడు వారు సెంటిమెంట్ గా భావించే పూజారుల శాపనార్థాలు కలిసి ఆ పార్టీని చిత్తుగా ఓడించేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉపఎన్నికల్లో వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఆకాశం వైపు చూడటం మాని నేలచూపు చూస్తున్నారు. ఈ క్రమంలో శ్రీరాముడి పేరు చెప్పుకుని 2014లో అధికారంలోకి వచ్చి, ఆపై ఆయన్ను మరచిపోయినందునే భాజపా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఓడిపోతున్నదని అయోధ్య రామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య ఎస్ దాస్ శాపనార్థాలు పెట్టారు.

2014లో మోడీ హవా గట్టిగానే వీచింది కానీ ఇప్పుడు ఆ పప్పులు అంత ఈజీగా ఉడికేలా కనపడడంలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే, వెంటనే రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించాలని, లేకుంటే బీజేపీకి అధికారాన్ని నిలుపు కోవడం క్లిష్టతరమవుతుందని ఆయన జోస్యంచెప్పారు. ఇకపోతే, తక్షణమే రామమందిరాన్ని నిర్మించకుంటే ఉద్యమిస్తామని చావాని టెంపుల్ అర్చకుడు మహంత్ పరమహంస దాస్ హెచ్చరించిన గంటల వ్యవధిలోనే ఆచార్య దాస్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇపుడు కాషాయ వర్గాల్లో కలకలం మొదలయ్యింది. రామమందిరం కోసం ఉద్యమం జరిగితే బీజేపీకి ఓటమి తప్పదని, ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో రాముడు పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో రాముడుని మోసం చేసినందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని వారు హెచ్చరించారు. అయితే నాలుగేళ్ల పాటు ఈ విషయాన్ని ప్రస్తావించకుండా ఇప్పుడు ఈ విధంగా హెచ్చరికలు జారీ చేయడానికి కారణం కేంద్ర మంత్రి, బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తాజా ప్రకటనేనని చెప్పవచ్చు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో హిందుత్వం, రామాలయం ప్రదానాంశాలు కాబోవని నఖ్వీ పేర్కొన్నారు అభివృద్ధే ప్రధానాంశంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలకి కౌంటర్ గానే ఇలా రెండు ఆలయాల పూజారులు అని ఉండొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.