వైకాపా ఎంపీల రాజీనామా ఆమోదం ! అందుకే ఇంత లేట్ చేశారా ?

ysrcp mps resignations accepted loksabha speaker sumitra mahajan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత పార్లమెంటు సమాశాల చివరి రోజున తమ పదవులకు రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు కాసేపటి క్రితం లోక్ సభ స్పీకర్ సుమిత్రామహాజన్ కార్యాలయానికి చేరుకుని, ఆమెతో భేటీ అయ్యారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని మరోసారి ఆమెను కోరారు. పార్లమెంటు సమాశాల చివరి రోజు అయిన ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలను సమర్పించారు. అయితే రాజీనామాలను సుమిత్ర పెండింగ్ లో పెట్టారు. మే 29న స్పీకర్ ను కలిసిన ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు. అయితే, ప్రత్యేక హోదాకు సంబంధించిన భావోద్వేగాలతోనే రాజీనామా చేస్తున్నట్టు తాను భావిస్తున్నానని… మరోసారి ఆలోచించుకోవాలని ఎంపీలకు సుమిత్ర చెప్పి పంపించారు.

అయితే మా ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి బుధవారం మీడియాకు తెలిపారు. మరోసారి రాజీనామా లేఖలు ఇవ్వాలని స్పీకర్ కోరారని చెప్పారు. రీకన్ఫర్మేషన్ లేఖలు ఇవ్వాలని కోరారని చెప్పారన్నారు. మా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పీకర్‌కు చెప్పామని, దీంతో ఆమె రీకన్ఫర్మేషన్ లేఖలు ఇస్తున్నామని, దీంతో వాటిని ఇస్తే రాజీనామా ఆమోదిస్తానని ఆమె చెప్పారని వైసీపీ ఎంపీలు చెప్పారు. పార్టీ మారిన మరో ముగ్గురు తమ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ని కోరినట్లు ఆయన మీడియాకు తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం వెలువడవచ్చునని తెలుస్తోంది. ఎంపీలు మాత్రం తమ రాజీనామాలు ఆమోదించినట్లు మీడియాకి తెలిపారు. అయితే కర్నాటక ఎన్నికల బలనిరూపణ సమయంలో లోక్ సభ సభ్యత్వానికి ఆ రాష్ట్ర సీఎం డిప్యూటీ సీఎం అభ్యర్ధులు రాజీనామా చేస్తే 12 గంటల లోపే ఆమోదించిన స్పీకర్ వీరి రాజీనామాలని ఆమోదించడానికి రెండు నెలల సమయం తీసుకోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.