జీవీఎల్ ని ఉతికి ఆరేసిన కుటుంబరావు.

Kutumba Rao Comments on GVL Narasimha Rao

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కేంద్ర ప్రభుత్వం తమని ఏదో రకంగా ఇబ్బంది పెడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు సర్కార్ ఏ మాత్రం లెక్క చేయడం లేదు. అగ్రిగోల్డ్ సహా ఎయిర్ ఏషియా అంశంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన ఆరోపణలకు రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు కుటుంబరావు గంటల వ్యవధిలోనే కౌంటర్ ఇచ్చారు. తాను షేర్ మార్కెట్ నుంచి వచ్చానని జీవీఎల్ చేసిన వ్యాఖ్యానం మొదలుకుని వివిధ అంశాల్లో ఘాటుగా జవాబు ఇచ్చారు. ఓ సెఫాలజిస్ట్ నుంచి ఎంపీ గా ఎదగడమే కాకుండా 25 కోట్లకి పైగా ఆస్తులు సంపాదించారని జీవీఎల్ కి కుటుంబరావు పదేపదే అభినందనలు తెలిపారు. ఇక అగ్రి గోల్డ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ తప్పు చేయలేదని , అందుకు భిన్నంగా ఏదైనా ఆధారాలు ఉంటే కోర్టుకి వెళ్లొచ్చు అని కుటుంబరావు జీవీఎల్ కి సవాల్ విసిరారు. ఇక ఇంతకు ముందు కేంద్ర కుంభకోణాలపై త్వరలో బాంబు పేలుస్తామని చెప్పిన కుటుంబరావు అందుకు సంబంధించి ఓ క్లూ కూడా చెప్పారు.

ఇక జీవీఎల్ బాడీ లాంగ్వేజ్ , మాటల దూకుడు మీద కుటుంబరావు తీవ్ర స్థాయిలో ఇచ్చిన కౌంటర్లు చూసి ప్రెస్ మీట్ కి వచ్చిన విలేకరులు సైతం పొగడ్తలు కురిపించారు. మొత్తానికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధంలో భాగంగా తెరపైకి వచ్చిన జీవీఎల్, కుటుంబరావు లు వాతావరణాన్ని వేడెక్కించారు. అయితే ఇప్పటిదాకా జరిగిన వ్యవహారం చూస్తే కుటుంబరావు దెబ్బకు జీవీఎల్ పూర్తి డిఫెన్స్ లో పడ్డట్టు అనిపిస్తోంది.