‘దేవ్’డు ఎక్కడ పవన్ ?

why pawan kalyan not responding about political strategist Dev issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జనసేన రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనుందని ప్రకటించి అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏ రోజు అయితే అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించాడో ఆరోజే మా పార్టీ వ్యూహకర్త అన్తోపో ఒక వ్యక్తిని పవన్ తన శ్రేణులకి మీడియాకి పరిచయం చేశాడు. ఆయనే జనసేన వ్యూహ కర్త దేవ్. అయితే పవన్ నటుడు కాబట్టి ఆయన ముందు నేను కూడా నటించాలి అనుకున్నాడో ఏమో పాపం పక్కా తెలంగాణా లోకల్ కుర్రాడు అయి ఉంది తెలుగులో మాట్లాడగలిగి అసలు ఇప్పుడే ఎదో విదేశాల నుండి ఊడిపడ్డట్టు కలరింగ్ ఇచ్చాడు. అయితే ఇదంతా మీడియా బయట పెట్టి ఉతికి ఆరేసింది అనుకోండి అది వేరే సంగతి.

అయితే తర్వాత నుండి ఎప్పుడూ పవన్ నోటి వెంట దేవ్ అనే మాట వినపడకపోవడం ఆశ్చర్యకరమైన అంశం, అసలు ఇంతలా మీడియా జనసేన పరువు తీస్తుంటే కనీసం క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు పవన్ కళ్యాణ్. ఇక మే 10 నుండి యాత్ర మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ తర్వాత కూడా ఎన్నడూ దేవ్ పేరును కనీసం గుర్తు కూడా చేయలేదు. కానీ సోషల్ మీడియాలో శతగ్ని పేరుతో కొన్ని పోస్టూలని జనసైనికులు షేర్ చేస్తున్నారు. ఇవి బాహుబలి, లీడర్ వంటి సినిమాల లోని కొన్ని ఫోటోలు మార్ఫింగ్ చేసి పవన్ కు అనునయిస్తూ వైరల్ చేయడం లో కాస్త దేవ్ మార్క్ కనపడుతుంది అని సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు జనసేనకి అసలు వాసు దేవ్ వ్యుహకర్తగా ఉన్నాడా లేదా అనేది జనసేన వర్గాలకే తెలియాలి మరి.