వర్మకు అసూయగా ఉందట

Ram Gopal Varma comments on director sandeep

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్‌. ఆ సినిమాపై పలు విమర్శలు వచ్చినా, వివాదాలు నెలకొన్నా కూడా సినిమాను తాను అనుకున్న విధంగా విడుదల చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మొదటి సినిమా సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌కు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా సందీప్‌ తన తర్వాత సినిమా కథను సిద్దం చేశాడు. ఆ కథను దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు ముంబయిలోని ఆయన కంపెనీకి వెళ్లి వినిపించడం జరిగింది. కథ విన్న తర్వాత రామ్‌ గోపాల్‌ వర్మ కాస్త అతిగా స్పందించాడు. ఫేస్‌బుక్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

RGV-and-sandeep-reddy-vanga

దర్శకుడు సందీప్‌ చెప్పిన కథ విని షాక్‌ అయ్యాను, ఇంత మంచి కథ తయారు చేసినందుకు సందీప్‌పై అసూయగా ఉందని వర్మ నిర్మొహమాటంగా చెప్పేశాడు. అర్జున్‌రెడ్డి సినిమా ఈ కథ ముందు సూపర్‌ ఫ్లాప్‌ అంటూ వర్మ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. సందీప్‌ తర్వాత సినిమా మెగా సక్సెస్‌ గ్యారెంటీ అంటూ వర్మ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడం జరిగింది. సందీప్‌ తన తర్వాత సినిమాను శర్వానంద్‌ హీరోగా చేయబోతున్నాడు. వర్మ మాటలను బట్టి చూస్తుంటే శర్వానంద్‌కు వచ్చే సంవత్సరం మరో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ గ్యారెంటీ అని సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే ‘శతమానంభవతి’ మరియు ‘మహానుభావుడు’ చిత్రాలతో శర్వానంద్‌ సక్సెస్‌లను దక్కించుకున్నాడు. సందీప్‌ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాతో వచ్చే సంవత్సరం శర్వానంద్‌ మరో సక్సెస్‌ను దక్కించుకోవడం గ్యారెంటీ అంటూ అప్పుడే టాక్‌ వినిపిస్తుంది.