షాలినికి ఆఫర్స్‌ వెళ్లువ

Shalini Pandey getsmore movie offers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఒక్క కొత్త హీరోయిన్‌ సక్సెస్‌ అయ్యింది అంటే వెంటనే ఆ హీరోయిన్‌ వెంట హీరోలు, దర్శకులు, నిర్మాతలు పరుగులు పెట్టడం సర్వ సాధారణం. ఇటీవల ‘ఫిదా’ చిత్రంతో ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవికి వరుసగా ఆఫర్లు వెళ్తువెత్తుతున్నాయి. ఆమెకు కోటికి పైగా పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి షాలిని పాండే ముందు ఉంది. ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన షాలిని పాండేకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

‘అర్జున్‌ రెడ్డి’ సినిమా సక్సెస్‌ అయిన నేపథ్యంలో షాలిని పాండేను తమ సినిమాలో బుక్‌ చేసుకునేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంలో ఆమె నటన మరియు ఆమె అందం హైలైట్‌గా నిలిచాయి. విజయ్‌తో ఆమె చేసిన రొమాన్స్‌ సినిమాకు హైలైట్‌గా ఉన్నాయి. అందాల ఆరబోతతో పాటు, ముద్దు సీన్‌లకు కూడా ఆమె ఓకే చెప్పేందుకు సిద్దం అయిన నేపథ్యంలో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు తన రెండవ సినిమాకు కమిట్‌ కాని షాలిని పాండే త్వరలోనే సెకండ్‌ సినిమాకు సైన్‌ చేస్తుందేమో చూడాలి. మొదటి సినిమా అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ త్వరలో శర్వానంద్‌ హీరోగా ఒక సినిమా చేయబోతున్నాడు. అందులో కూడా ఈమెను తీసుకునే అవకాశం ఉంది. శర్వాతో షాలిని పాండే రెండవ సినిమా ఉండే అవకాశం ఉందని సమాచారం.

మరిన్ని వార్తలు:

జైలవకుశ సందడి షురూ

నమ్మలేని నిజం… బిగ్‌బాస్‌ ఇంటికి బాలయ్య?

కుశ సీరియస్ అండ్ జోవియల్.