కళ్యాణ్ రామ్ మరీ రిస్క్ తీసుకున్నాడట

kalyan ram next movie 118

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, తమిళ డైరక్టర్ కెవి. గుహన్ దర్శకత్వంలో రుపొందుతున్నా చిత్రం 118. ఈ చిత్రం యొక్క లోగోను మరియు కళ్యాణ్ రామ్ లుక్ ను విడుదల చేశారు. విభినమైన గెట్ అప్ తో కళ్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడు. ఇకా ఈ చిత్రం ద్వారా తమిళ డైరక్టర్ తెలుగుకు పరిచయం అవ్వుతున్నాడు. కెవి గుహన్ తెలుగు మూవీ హ్యాపీ డేస్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేశాడు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నివేత థామస్ మరియు షాలిని పాండే కథానాయకలుగా నటిస్తున్నారు. 118 చిత్రాని మహేష్ కొన్నేరు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర పైన నిర్మిస్తున్నాడు. తాజాగా మహేష్ కోనేరు కళ్యాణ్ రామ్ పైన ఆసక్తికర ట్వీట్ చేశారు.కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో కొన్ని రిస్క్ సిన్స్ చేశారు. అవేమిటో గెస్ చెయ్యమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తరువాత ఆయనే క్లారిటీ ఇస్తూ కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో కొన్ని షాట్స్ కొరకు వాటర్ లో డిప్ డైవ్ చెయ్యడం కోసం శిక్షణ తీసుకుంటున్నా వీడియోను మహేష్ కొన్నేరు ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేశాడు. కొందరు కళ్యాణ్ రామ్ చేస్తున్నా దైర్యని ప్రశంసిస్తుంటే, మరికొందరు ఇలాంటివి రిస్క్ చేస్తున్నపుడు జాగ్రతగా ఉండాలంటున్నారు. కళ్యాణ్ రామ్ గత కొన్ని రోజులు గా సినిమా ఫ్లాప్స్ తో సతమతం అవ్వుతున్నాడు ఈ సారి ఎలాగైనా హిట్ట్ సాదించాలని ఇలాంటి కొన్ని సిన్స్ ను రిస్క్ తీసుకుంటున్నాడు. 118 కోసం కళ్యాణ్ రామ్ ప్రాణం పెట్టి పని చేస్తున్నాడు.