మ‌హాన‌టి చూసి దిమ్మ‌తిరిగిపోయిందంటున్న తెలంగాణ మంత్రి

KTr Tweets on mahanati movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మహాన‌టి అంచ‌నాల‌కు మించి విజ‌యం సాధించింది. ఫ‌స్ట్ షో తోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న మ‌హాన‌టి సాధార‌ణ ప్రేక్ష‌కుల నుంచి సెల‌బ్రిటీల దాకా అంద‌రినీ క‌ట్టిప‌డేసింది. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు మ‌హాన‌టి చిత్ర‌బృందంపై, ముఖ్యంగా సావిత్రి పాత్ర‌లో ఒదిగిపోయిన కీర్తిసురేశ్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. తాజాగా తెలంగాణ‌ మంత్రి కేటీఆర్ కూడా మ‌హాన‌టి గురించి ట్విట్ట‌ర్ లో స్పందించారు. బుధ‌వారం రాత్రి సినిమా చూశాన‌ని చెప్పిన ఆయ‌న మ‌హాన‌టిపై త‌న అభిప్రాయం వెల్ల‌డించారు. ఎంత‌టి అద్భుత‌మైన చిత్రం….మ‌హాన‌టి సినిమా చూసి దిమ్మ‌తిరిగిపోయింది. కీర్తి సురేశ్ సావిత్రి పాత్ర‌లో జీవించేశారు. అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌.

సావిత్రి సినిమాను గొప్ప‌గా తెర‌కెక్కించిన నాగ్ అశ్విన్ కు, నిర్మాత స్వ‌ప్న‌ద‌త్ కు నా అభినంద‌న‌లు. స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నాగ చైత‌న్య చాలా బాగా న‌టించారు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. మ‌హాన‌టి భార‌త్ లోనే కాకుండా ఓవ‌ర్సీస్ లోనూ రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాలో కేవ‌లం ప్రివ్యూల ద్వారానే రూ. 1.54కోట్లు వ‌సూలు చేసిన‌ట్టు చెబుతున్నారు. మ‌హాన‌టి మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ లోకి సులువుగా చేరుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అటు సినిమా శాటిలైట్ రైట్స్ ను ఓ ఛాన‌ల్ రూ. 10కోట్లు చెల్లించి సొంతం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

నిజానికి తొలుత నాగ్ అశ్విన్ మ‌హాన‌టి ప్ర‌క‌టించిన‌ప్పుడు ఈ సినిమాపై ఎవ‌రూ పెద్ద‌గా ఆస‌క్తిచూప‌లేదు. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కు పెద్ద క్రేజ్ లేక‌పోవ‌డం, సావిత్రి జీవిత చ‌రిత్ర‌ విషాదాంతం వంటి కార‌ణాల‌తో శాటిలైట్ రైట్స్ కోసం ఏ చాన‌ల్ ముందుకు రాలేదు. కానీ ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలివిగా సినిమాపై క్రేజ్ పెంచుతూ పోయారు. కీలక పాత్ర‌ల కోసం ప్ర‌ముఖ న‌టుల‌ను తీసుకోవ‌డంతో పాటు..సినిమాలో వారి వేష‌ధార‌ణ ఎలా ఉంటుందో…ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ప్రారంభించేవ‌ర‌కు సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌డం…సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. త‌ర్వాత పాత్ర‌లు ప‌రిచ‌యం చేస్తూ సాగిన ఫ‌స్ట్ లుక్ లు సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొనేలా చేశాయి. ఇక సినిమా విడుద‌లై ఫ‌స్ట్ షోతోనే ఘ‌న‌విజ‌యం టాక్ సొంతం చేసుకోవ‌డంతో శాటిలైట్ రైట్స్ కోసం చాన‌ల్స్ పోటీప‌డ్డాయి. చివ‌ర‌కు స్టార్ హీరోల సినిమాల‌తో స‌మానంగా మ‌హాన‌టి..రూ. 10 కోట్లు ద‌క్కించుకోవ‌డం..టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయింది.