శ్రీమంతుడిని టార్గెట్‌ చేసిన మహానటి

srimanthudu record breaks on mahanati movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భరత్‌ అనే నేను’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి టాలీవుడ్‌ టాప్‌ చిత్రాల జాబితాలో చేరింది. తాజాగా ఈ చిత్రం మాదిరిగానే గతంలో వీరిద్దరు కలిసి ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని చేయడం జరిగింది. ఆ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుని అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాసి సరికొత్త రికార్డులను సృష్టించింది. అలాంటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీమంతుడు రికార్డును ఇప్పుడు మహానటి బ్రేక్‌ చేసేందుకు కూత వేటు దూరంలో ఉంది. మరో వారాంతంకు శ్రీమంతుడు రికార్డును బద్దలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మహానటి’ చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో అద్బుతమైన రెస్పాన్స్‌ను దక్కించుకున్న మహానటి సునాయాసంగా టాప్‌ 10 చిత్రాల జాబితాలో చేరింది. ప్రస్తుతం టాప్‌ 6 చిత్రంగా మహానటి ఉంది. మరి కొన్ని రోజుల్లో టాప్‌ 5 స్థానంలో ఉన్న శ్రీమంతుడు చిత్రంను క్రాస్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఓవర్సీస్‌లో కలెక్షన్స్‌ పరంగా 6వ స్థానంను మహానటి దక్కించుకోవడం ఖాయం అంటూ ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. వారాంతాల్లో ఈ చిత్రం ఇప్పటికి మంచి వసూళ్లు సాధిస్తుంది. అందుకే శ్రీమంతుడు చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఊహించని కలెక్షన్స్‌ వస్తున్నాయి.