మల్టీస్టారర్‌లో చరణ్‌ పాత్ర క్లారిటీ..!

ram-charan-police-role-in-R

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జక్కన్న మల్టీస్టారర్‌కు రంగం సిద్దం అయ్యింది. దాదాపు ఆరు నెలలుగా ఈ చిత్రం గురించి అదుగో కథ, ఇదిగో స్క్రిప్ట్‌ అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు తమకు కథ చెప్పాలేదని రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లు క్లారిటీ ఇచ్చారు. కేవలం స్టోరీ లైన్‌తో సినిమాను ఒప్పించినట్లుగా వారిద్దరు కూడా పేర్కొన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కథ సిద్దం అయ్యిందని, ప్రస్తుతం లొకేషన్స్‌ ఎంపిక మరియు ఇతరత్ర ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుందని సమాచారం అందుతుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో పట్టాలెక్కించబోతున్నారు.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు అన్నదమ్ముళ్లుగా కనిపించబోతున్నారు అంటూ మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరు కూడా ఫైటర్స్‌గా కనిపిస్తారని పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ చిత్రం గురించిన మరో వార్త సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ పోలీస్‌గా కనిపిస్తాడని, ఎన్టీఆర్‌ ఒక ప్రైవేట్‌ ఉద్యోగిగా కనిపిస్తాడు అంటూ సమాచారం అందుతుంది. ఇద్దరు అన్నదమ్ముల మద్య జరిగే సెంటిమెంట్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని సినీ వర్గాల వారు చెబుతున్నారు. రామ్‌ చరణ్‌ ‘తుఫాన్‌’ చిత్రంలో పోలీస్‌గా నటించి మెప్పించలేక పోయాడు. అందుకే ఈ సినిమాలో చరణ్‌ పోలీస్‌ అనగానే మెగా ఫ్యాన్స్‌ కాస్త కంగారు పడుతున్నారు. అయితే రాజమౌళి ఏ పాత్రను అయినా, ఎలాంటి కథను అయినా అద్బుతంగా తెరకెక్కించడంలో దిట్ట అనే విషయం తెల్సిందే.