‘ఆఫీసర్‌’పై వర్మ నమ్మకంకు చూస్తే ఆశ్చర్యం..

Ram Gopal Varma Confidence On Officer Movie Is Just Amazing

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆఫీసర్‌’ చిత్రం జూన్‌ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున పోలీస్‌గా కనిపించబోతున్నాడు. నాగార్జున, వర్మల కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశానికి తాకేలా ఉన్నాయి. అయితే వర్మ గత కొన్నాళ్లుగా ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్‌ను తీయలేక పోయాడు. దాంతో కొందరు ఈ సినిమా కూడా వాటి పరిస్థితినే ఎదుర్కొంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తానికి ఆఫీసర్‌ ఫలితంపై అంచనాలు అటు ఇటుగా ఉన్నాయి. కొందరు సూపర్‌ అంటే మరి కొందరు మాత్రం అంత లేదు అంటున్నారు. అయితే వర్మ మాత్రం ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్‌గా ఉంటుందని, అలా లేకుంటే తాను ఏం చేసేందుకు అయినా సిద్దం అంటూ ముందు నుండి చెబుతూ వస్తున్నాడు.

‘ఆఫీసర్‌’ కథ చెప్పిన సమయంలో నాగార్జునతో వర్మ మాట్లాడుతూ ఈ చిత్రం కథను ఎలా అయితే చెప్పానో అలాగే తెరకెక్కిస్తాను. ఖచ్చితంగా సినిమా ఆకట్టుకునే విధంగా ఉండేలా స్క్రీన్‌ప్లే నడిపిస్తాను అంటూ హామీ ఇచ్చాడు. ఒకవేళ తన హామీని నెరవేర్చుకోలేని పక్షంలో తనని తన్నినా పడతాను అంటూ వర్మ చెప్పుకొచ్చాడట. తాజాగా నాగార్జున ఆ విషయమై మాట్లాడుతూ వర్మను తన్నే అవసరం లేదు. ఈ చిత్రాన్ని ఆయన అద్బుతంగా తెరకెక్కించాడు అంటూ ప్రీ రిలీజ్‌ వేడుకలో చెప్పుకొచ్చాడు. ఇంత నమ్మకంతో వర్మ ‘ఆఫీసర్‌’ విషయంలో ఉన్నడు కనుక సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని గంటల్లో ‘ఆఫీసర్‌’ సినిమా ఫలితంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.