ఆఫీసర్‌పై నెగటివ్‌ ప్రచారం

Negative Propaganda On Rgv Officer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘ఆఫీసర్‌’ చిత్రం జూన్‌ 1న విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రం సెన్సార్‌ రిపోర్ట్‌ కూడా పూర్తి అయ్యింది. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో చిత్రంపై సోషల్‌ మీడియాలో నెగటివ్‌ ప్రచారం మొదలైంది. ‘ఆఫీసర్‌’ చిత్రంను చూసిన సెన్సార్‌ సభ్యులు పరమ బోరింగ్‌గా ఉంది అంటూ కామెంట్స్‌ చేశారని సోషల్‌ మీడియాలో కొందరు పోస్ట్‌ చేశారు. అది కాస్త వైరల్‌ అయ్యింది. ఆఫీసర్‌ చిత్రం పాత పోలీస్‌ చిత్రాలను మిక్కీలో వేసి రుబ్బినట్లుగా ఉంది తప్ప కొత్తగా ఏమీ లేదని అంటున్నారు. మొత్తానికి వర్మ దర్శకత్వంలో ఆఫీసర్‌ సినిమా విడుదలకు ముందే అట్టర్‌ ఫ్లాప్‌ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.

వివాదాల దర్శకుడు వర్మ ఇటీవలే మెగా ఫ్యామిలీతో సున్నం పెట్టుకున్న విషయం తెల్సిందే. పవన్‌ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా వర్మ సినిమాను తాము బ్యాన్‌ చేస్తామంటూ మెగా ఫ్యాన్స్‌ మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. అన్నట్లుగానే ఆఫీసర్‌కు డ్యామేజ్‌ చేసేలా వారు కామెంట్స్‌ చేస్తూ వస్తున్నారు. ఆఫీసర్‌ చిత్రం టీజర్‌ మరియు ట్రైలర్‌లు ఏమాత్రం ఆకట్టుకోలేదని, తప్పకుండా ఈ సినిమా కూడా ఆకట్టుకోదంటూ మెగా ఫ్యాన్స్‌ కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఆర్జీవీకి ఇది మరో ఫ్లాప్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్‌ గోపాల్‌ వర్మ టెన్షన్‌ పడుతున్నాడు. సినిమాపై ఇలాంటి ప్రచారం ఏదో వస్తుందని ముందు నుండే చిత్ర యూనిట్‌ సభ్యులు అనుకున్నారు. అందుకే పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. సొంతంగా విడుదల చేస్తున్న వర్మకు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.