నాగ్‌కు వర్మ హామీ… అది నెరవేర్చితే మరో ‘శివ’

Nagarjuna speech in Nag-Ram Gopal Varma new Movie launch

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
చాలా సంవత్సరాలుగా వర్మకు సరైన సక్సెస్‌ లేదు. బాలీవుడ్‌లో సక్సెస్‌లు దక్కకపోవడంతో టాలీవుడ్‌కు వచ్చిన వర్మ, ఇక్కడ పిచ్చి పిచ్చి సినిమాలు తీసి తన పరువు పోగొట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో నాగార్జున ఆయన దర్శకత్వంలో చేసేందుకు కమిట్‌ అయ్యాడు అనగానే అంతా కూడా నాగార్జునకు మైండ్‌ ఏమైనా దొబ్బిందా అంటూ విమర్శలు చేశారు. వర్మతో నాగ్‌ సినిమా చేయడం అనేది అతి పెద్ద చెత్త నిర్ణయం అంటూ కొందరు ఎద్దేవ చేశారు. కాని వర్మపై నాగార్జున చాలా నమ్మకం పెట్టుకుని ఈ సినిమా ఒప్పుకున్నట్లుగా అనిపిస్తుంది. నేడు షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం అయిన సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తున్నాయి.

Nagarjuna first look in Ram Gopal Varma Movie

నాగార్జున మాట్లాడుతూ… మా కాంబినేషన్‌లో వచ్చిన ‘శివ’ చిత్రం ఒక టెక్నికల్‌ రెవల్యూషన్‌ తీసుకు వచ్చింది. కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో ‘శివ’ సినిమా మార్పులు తీసుకు వచ్చింది. ‘శివ’ సినిమా ఇండియన్‌ సినిమా స్టైల్‌ను మార్చేసింది. ఇక ఇప్పుడు కూడా ఈ చిత్రంతో కొత్త టెక్నికల్‌ వ్యాల్యూస్‌ను తీసుకు వస్తాను అని, శివ చిత్రాన్ని మించి టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో సినిమాను తెరకెక్కిస్తాను అంటూ వర్మ నాకు హామీ ఇచ్చాడు. వర్మ కొన్ని సీన్స్‌ చెప్పాడు. ఆ సీన్స్‌ ఖచ్చితంగా ఇది శివను మించేలా ఉంటుందనే నమ్మకం కలిగింది. వర్మ ఆ హామీ నెరవేర్చితే సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవ్వడం ఖాయం అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. వర్మ అన్నట్లుగా కొత్త టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో సినిమా వస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆధరిస్తారు.