‘మహానటి’కి జక్కన్న రివ్యూ

rajamouli review on mahanati movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సావిత్రి జీవిత చరిత్రకు వెండి తెర రూపం ‘మహానటి’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహానటి సావిత్రి జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఆవిష్కరించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. అన్ని వర్గాల వారు కూడా దర్శకుడు అద్బుతంగా చిత్రీకరించాడని, కీర్తి సురేష్‌ సావిత్రిగా నటించకుండా జీవించింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి కూడా ‘మహానటి’ చిత్రంపై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు. తన మనసుకు నచ్చిన సినిమాలపై నిర్మొహమాటంగా, ఎలాంటి బేషజాలకు పోకుండా రివ్యూ ఇచ్చే జక్కన్న ఈ సినిమాకు కూడా అదే విధంగా తన కామెంట్స్‌ ఇచ్చాడు.

ఈ చిత్రంపై జక్కన్న సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ చాలా బాగా చేసింది. సావిత్రి గారిని అనుకరిస్తున్నట్లుగా కాకుండా ఆమె పాత్రలో లీనమై పోయినట్లుగా, నిజమైన సావిత్రి అన్నట్లుగా నటించింది. ఇక ఈ చిత్రంలో జెమిని గణేష్‌ పాత్రను పోషించిన దుల్కర్‌ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల జల్లు కురిపించాడు. ఇకపై తాను దుల్కర్‌కు అభిమానిని అంటూ ఆసక్తికర పోస్ట్‌ చేశాడు. కేవలం రాజమౌళి మాత్రమే కాకుండా ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా ‘మహానటి’ని అద్బుతం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.