సావిత్రే కీర్తిని త‌న పాత్ర‌కు ఎంచుకుందేమో…

Vijaya Chamundeswari prices Keerthi Suresh over Mahanati movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన మ‌హాన‌టిపై ఆమె కుమార్తె విజ‌య‌చాముండేశ్వ‌రి ప్ర‌శంసల వ‌ర్షం కురిపించారు. మ‌హాన‌టి సినిమా అనుకున్న‌దానికి మించి అద్భుతంగా ఉంద‌ని కొనియాడారు. విజ‌య‌వాడ బెంజ్ స‌ర్కిల్ లోని ట్రెండ్ సెట్ మాల్ లో విజ‌య‌చాముండేశ్వ‌రి, అశ్వినీద‌త్ సంద‌డిచేశారు. అమ్మ పాత్ర‌లో కీర్తిసురేశ్ చ‌క్క‌గా ఒదిగిపోయి న‌టించింద‌ని, అమ్మే కీర్తిని త‌న పాత్ర‌కు ఎంచుకుందేమో అనిపించింద‌ని చెప్పారు. అమ్మ నిజ‌మైన క‌థ అభిమానుల‌కు ఇప్పుడు తెలుస్తుంద‌ని, ఇప్ప‌టివ‌ర‌కూ తెలిసింది నిజం కాద‌ని ఆమె భావోద్వేగానికి లోన‌య్యారు. అమ్మ చిన్న‌త‌నం నుంచి అగ్ర క‌థానాయిక‌గా ఎదిగిన తీరు సినిమా రూపంలో చూడ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

తెలుగుచిత్ర ప‌రిశ్ర‌మ‌తో పాటు తెలుగువారి మ‌న‌సుల్లో సుస్థిర‌స్థానం సంపాదించుకున్న మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ‌ను చిత్రీక‌రించ‌డం చాలా పెద్ద కోరిక‌ని, దాన్ని విజ‌య‌వంతంగా నెర‌వేర్చుకోగ‌లిగామ‌ని అశ్వినీద‌త్ ఆనందం వ్య‌క్తంచేశారు. 18 నెల‌ల కృషి ఇప్పుడు ఆవిష్కృత‌మైంద‌ని, కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతోనే ఇది సాధ్య‌మైంద‌ని అన్నారు. సావిత్రి క‌ట్టు, బొట్టు స‌హా అన్ని అంశాల్లో ఆమె కుటుంబ స‌భ్యులు స‌హ‌క‌రించార‌ని, అందుకు త‌గ్గ‌ట్టుగానే కీర్తిసురేశ్ న‌ట‌న అమోఘంగా సాగింద‌ని… సావిత్రిని మ‌రిపించే విధంగా న‌టించింద‌ని కొనియాడారు. ఆ మ‌హాన‌టి ఆత్మే ఈ చిత్రాన్ని ద‌గ్గ‌రుండి పూర్తిచేయించుకుంద‌ని అశ్వినీద‌త్ వ్యాఖ్యానించారు. `