ఎన్టీఆర్‌ నో చెప్పడం మంచిదైంది!

NTR took Good Decision in not acting in Mahanati movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘మహానటి’ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో సావిత్రి పాత్రను కీర్తి సురేష్‌ పోషించిన విషయం తెల్సిందే. సావిత్రి పాత్రలో ఆమె ఒదిగి పోయింది. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన తారాగణం అంతా కూడా వావ్‌ అనిపించారు. అయితే ఏయన్నార్‌ పాత్రలో నటించిన నాగచైతన్య మాత్రం కాస్త నిరుత్సాహ పర్చాడు. ఏయన్నార్‌ అనగానే ప్రేక్షకులు చాలా ఆశించారు. కాని నాగచైతన్య తన తాతను మరిపించడంలో విఫలం అయ్యాడు. నాచైతన్య ఈ పాత్రను చేయకుంటే బాగుండేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక ఇదే చిత్రంలో నందమూరి తారక రామారావు పాత్రలో ఎన్టీఆర్‌ను నటింపజేయాలని భావించారు. కాని ఎన్టీఆర్‌ సున్నితంగా నో చెప్పాడు.

‘మహానటి’ చిత్రంలో ఎన్టీఆర్‌ నటించక పోవడమే మంచిదైనదంటూ సినిమా విడుదల తర్వాత కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సావిత్రి కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రను ఉంచినట్లయితే సినిమా ఫోకస్‌ ఎక్కువ ఎన్టీఆర్‌పై పడేది. దాంతో పాటు సినిమాలో యంగ్‌ టైగర్‌ ఉండటం వల్ల సినిమా వెయిట్‌ పెరిగి అంచనాలను అందుకోలేక పోతే ఢమాల్‌ అంటే పడిపోయేది. అందుకే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ నటించకపోవడం మంచిదని తమ విశ్లేషన చెబుతున్నారు. నాగచైతన్య పాత్ర ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. అదే విధంగా ఎన్టీఆర్‌ పాత్ర కూడా ఉంటే ఆకట్టుకోలేక పోయేదేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కొందరు మహానటిలో ఎన్టీఆర్‌ లేకపోవడం మంచిదని అంటుండగా, మరి కొందరు మాత్రం సినిమా స్థాయి పెంచేందుకు ఎన్టీఆర్‌ నటిస్తే బాగుండేది అంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.