కృష్ణా జిల్లా నుండీ పవన్ పోటీ…ఆ నియోజకవర్గం నుండే !

Pawan Kalyan will contest from Krishna district says Muthanthashetty

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ప్రత్యక్ష ఎన్నికల పోటీలో ఉంటామని పవన్ కల్యాణ్ ఇది వరకే ప్రకటించారు. ఇక తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని కూడా ఇటీవలే పవన్ ప్రకటించిన సంగతి విదితమే. అలాగే తాను కూడా తను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు. ఒక దశలో బలం ఉన్న చోటే పోటీ అని చెప్పిన పవన్ కల్యాణ్ తాజాగా యూ టర్న్ తీసుకుని తమ పార్టీ ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీలో ఉంటుందని తెలిపారు.

ముందుగా తాను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు. అయితే పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశంపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. అయితే అటువంటి పరిణామాల మధ్య జనసేన పార్టీ కృష్ణా జిల్లా ఇన్‌చార్జి ముత్తంశెట్టి కృష్ణారావు చేసిన ఒక ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా నుంచి పోటీ చేస్తారని ముత్తంశెట్టి ప్రకటించారు.

ఈ జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పవన్ పోటీ ఉంటుందని ఆయన తెలిపారు. ఆ మేరకు ఆ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని పవన్ కల్యాణ్ అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. అనంతపురం నుంచి పోటీ చేస్తానని పవన్ గతంలో ప్రకటించినా, ఇప్పుడు మాత్రం పవన్ పోటీ అవనిగడ్డ నుంచి అని అంటున్నారు. ఈ విషయంలో కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే అనంతపురం జిల్లా నుండి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ముందుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే అనంతపురం జిల్లాలోని ఏ స్థానం నుండి పోటీ చేస్తారనే దాని పై స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో ఆవనిగడ్డ నుండి పోటీ చేస్తారనే ప్రకటన రావడంతో పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తారని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అనంతపురంతో పాటు ఆవనిగడ్డ నుండి అంటే రెండు స్థానాల నుండి పోటీ చేస్తారా అనే చర్చ కూడ సాగుతోంది.