క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న త‌మ‌న్నా

Tamanna to do with Kalyan Ram

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నంద‌మూరి కుటుంబంలో ఇప్ప‌టికే ఎన్టీఆర్ తో ఆడిపాడిన మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా… ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న న‌టించ‌టానికి సిద్ద‌మ‌వుతోంది. 180 ఫేమ్ జ‌యేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో క‌ళ్యాణ్ రామ్ ఓ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా త‌మ‌న్నా ను ఎంపిక‌చేసిన‌ట్టు తెలుస్తోంది.  ప్ర‌స్తుతం త‌మన్నా చేతిలో తెలుగు సినిమాలు ఏవీ లేవు. త‌మిళ చిత్రాల‌తో బిజీగా ఉన్న త‌మ‌న్నా… ఓ హిందీ చిత్రంలో కూడా న‌టిస్తూ చెన్నై, ముంబై మ‌ధ్య చక్కెర్లు కొడుతోంది.

శ్రీ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన త‌మ‌న్నా… హ్యాపీడేస్ తో బిజీ హీరోయిన్ అయింది. అయితే తెలుగు క‌న్నా ఎక్కువ‌గా త‌మిళ ఆఫ‌ర్లు ఆమెను ముంచెత్తాయి. ఒకానొక ద‌శ‌లో త‌మిళంలో నెంబ‌ర్ వ‌న్ రేంజ్ కు ఎదిగిన త‌మ‌న్నా… త‌రువాత తెలుగు సినిమాలపై దృష్టిపెట్టి కొన్ని త‌మిళ ఆఫ‌ర్లు వ‌దులుకుంది. తెలుగులో అగ్ర‌హీరోల అంద‌రి స‌ర‌స‌నా న‌టించిన త‌మ‌న్నాకు… ఇటీవ‌లి కాలంలో తెలుగులో ఆఫ‌ర్లు కాస్త తగ్గాయి. అడ‌పా ద‌డ‌పా హిందీ సినిమాలు చేస్తున్నా… అక్క‌డా చెప్పుకోద‌గ్గ విజ‌యం ల‌భించ‌లేదు. దీంతో మళ్లీ త‌మిళంపై దృష్టిపెట్టింది ఈ మిల్కీ బ్యూటీ.

ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ సినిమాతో తెలుగులోనూ మ‌ళ్లీ బిజీ కావాల‌ని భావిస్తోంది. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ రామ్ ఎం.ఎల్‌.ఎ చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో క‌ళ్యాణ్  రామ్ స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తోంది. అటు ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కుతున్న జైల‌వ‌కుశ కు నిర్మాత‌గానూ ఉన్న క‌ళ్యాణ్ రామ్ ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్త‌యిన త‌రువాత కొత్త చిత్రం ప్రారంభించ‌నున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌, కూల్ బ్రీజ్ సినిమాస్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పిసి శ్రీరాం సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

పవన్‌పై కామెంట్స్‌ చేసిన మహేష్‌… మెగా ఫ్యాన్స్‌ సీరియస్‌ 

రెచ్చగొడుతున్న వర్మ.. మూసుకున్న విహెచ్‌

కూతురు కోసం మంచి నిర్ణయం తీసుకున్న స్టార్ హీరో…