కూతురు కోసం మంచి నిర్ణయం తీసుకున్న స్టార్ హీరో…

sudeep with his wife priya withdraw divorce petition For Daughter

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కన్నడంలో స్టార్‌ హీరో, తెలుగులో ‘ఈగ’ చిత్రంతో స్టార్‌ విలన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ‘బాహుబలి’ చిత్రంలో చిన్న పాత్రను పోషించినప్పటికి మంచి గుర్తింపు వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని ఆయన కన్నడంలో రీమేక్‌ చేసి సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. ఆయన కిచ్చ సుదీప్‌. తాజాగా మెగా 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యాడు. సినిమాల పరంగా సక్సెస్‌ ఫుల్‌గా దూసుకు పోతున్న సుదీప్‌ ఫ్యామిలీ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. 2001లో ప్రియను ప్రేమ వివాహం చేసుకున్న సుదీప్‌ 2014 నుండి విబేధాల కారణంగా విడి విడిగా ఉంటున్న సుదీప్‌, ప్రియలు 2015లో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసేందుకు సిద్దం అయ్యింది.

ఈ సమయంలో వీరిద్దరు వారి పాప అయిన శాన్వి కోసం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. తమ న్యాయవాదిని కలిసి ఈ విషయాన్ని స్వయంగా సుదీప్‌ చెప్పాడట. అందుకు ప్రియ కూడా ఒప్పుకోవడంతో వీరి విడాకుల కేసును కోర్టు కొట్టి వేయడం జరిగింది. త్వరలో వీరిద్దరు కలిసి ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి మరీ తాము మళ్లీ కలిసి ఉండాలనుకుంటున్నట్లుగా చెప్తారని కన్నడ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. పాప కోసం వీరిద్దరు తీసుకున్న నిర్ణయంను ప్రతి ఒక్కరు అభినందించి తీరాలి. పిల్లల మనోభావాలు దెబ్బ తినకుండా, వారు చిన్న వయస్సులో ఇబ్బంది పడకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిదని ప్రముఖులు అంటున్నారు.

మరిన్ని వార్తలు:

నమ్మలేని నిజం… బిగ్‌బాస్‌ ఇంటికి బాలయ్య?

కుశ సీరియస్ అండ్ జోవియల్.

అర్జున్ రెడ్డి మూవీ తెలుగు బులెట్ రివ్యూ…