సైరా టీంకి షాకిచ్చిన బీదర్ వాసులు !

Syera Narasimha Reddy Movie Team Shock In Bidar

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న భారీ చారిత్రాత్మక చిత్రం సైరా న‌ర‌సింహ‌రెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు, న‌య‌న‌తార, త‌మ‌న్నా వంటి విల‌క్ష‌ణ‌ న‌టులు న‌టిస్తున్నారు. కాగ ఈ సినిమా షూట్ కు బ్రేక్ పడింది. బీదర్ కు వారంరోజుల షెడ్యూలుకు అన్ని పర్మిషన్లు తీసుకుని వెళ్లిన యూనిట్ తిరుగుముఖం పట్టింది.

ఈ షూటింగ్ కు సంబంధించి అన్ని పర్మిషన్స్ తీసుకుని ‘సైరా’ యూనిట్ బీదర్ కు చేరుకున్న తరువాత ఊహించని విధంగా అక్కడి స్థానికుల నుండి వ్యతిరేకత వచ్చినట్లు సమాచారం. ఈ షూటింగ్ కోసం వందల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు కత్తులు తలపాగాలు గెడ్డాలు పెట్టుకుని షూటింగ్ కు రెడీ కావడంతో ఈ హదావిదిని చూసిన బీదర్ లోని ఒక వర్గం వారు ఈ షూటింగ్ కొనసాగించడానికి తాము అంగీకరించమనీ బీదర్ చాల సెన్సిటివ్ ఏరియా అని అందువల్ల ఇప్పుడు ఉన్న పరిస్థుతుల రీత్యా ఇలాంటి ప్రయోగాలు వద్దనీ సూచించినట్లు టాక్. దర్శకుడు సురేంద్ర రెడ్డి బీదర్ ప్రాంతంలో అబ్యంతరాలు వ్యక్తం చేస్తున్న అక్కడి ప్రజలకు ఎంత నచ్చ చెప్పినా వారు అంగీకరించక పోవడంతో ‘సైరా’ యూనిట్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీదర్ లో షూట్ చేయడానికి ఇక కుదరదని డిసైడ్ అయిపోయి, హైదరాబాద్ కోకాపేట్ లో వేసిన భారీకోట సెట్ లో షూట్ చేసుకోవాలని నిర్ణయించారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం. ఇప్పటికే విడుదలై ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.