కేటీఆర్ కి ఆ సినిమా తెగ నచ్చిందట !

KGF Movie Attract In KTR

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించాక రాజకీయాల్లో బాగా బిజీ అయిన కేటీఆర్. అసెంబ్లీ సమావేశాలు, పార్టీ కార్యక్రమాలతో తీరికలేకుండా గడుపుతున్నారు. అదే సందర్భంలో ట్విట్టర్‌లో కూడా యాక్టివ్‌గా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా ఫాలోయింగ్ పెంచుకున్నారు. కాస్త తీరిక దొరికిన సమయంలో నెటిజన్లతో ముచ్చటిస్తూ.. తన అభిప్రాయాలను వారితో పంచుకుంటున్నారు. తాజాగా కేటీఆర్ కేజీఎఫ్ మూవీ చూశారట దీంతో సినిమా అదిరిపోయిందంటూ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌లో ‘కొద్దిగా ఆల‌స్యంగా అయినా.. చివరికి `కేజీఎఫ్‌` చూశాను. సినిమా అద్భుతంగా ఉంది..

సాంకేతికంగా, కథాపరంగా ఆకట్టుకుంది. కథను ఉత్కంఠంగా చూపించారు.. మరోపక్క కూల్‌గానూ అనిపించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. స్క్రీన్‌ఫై రాక్‌స్టార్ య‌ష్ నటన అదరిపోయిందని ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రాక్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్‌ మూవీ గతేడాది డిసెంబరులో విడుదలయ్యింది. సినిమా కన్నడతోపాటు తెలుగు, తమిళం‌, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల చేశారు. రూ.80 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర దాదాపు రూ.250 కోట్లు రాబట్టింది. దీంతో ఆ దర్శకుడిని తెలుగులో కూడా సినిమా చేయించాలని ప్లాన్ చేస్తున్నారు మన నిర్మాతలు.