వేడి పెంచేస్తున్న పూజిత !

Poojitha Ponnada Looks Too Bold In where Is Venkata Lakshmi

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో రొమాన్స్ హద్దులు దాటుతోంది. లిప్‌లాక్‌లు సర్వసాధారణమైపోయాయి. టాలీవుడ్‌లో లెక్కకు మించి వస్తోన్న చిన్న సినిమాలు యువతను ఆకట్టుకోవడానికి రొమాన్స్ మోతాదును పెంచుతున్నాయి. సినిమా విడుదలకు ముందు మంచి రొమాంటిక్ సన్నివేశాలతో కూడిన టీజర్లను వదులుతున్నారు. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా ఇలాంటి రొమాంటిక్ సినిమాలు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం తెలుగు నాట హాట్ టాపిక్‌ గా మారిన చిత్రం ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’. రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ రొమాంటిక్ చిత్రంలో పూజిత పొన్నాడ, కార్తిక్, ప్రవీణ్, మధునందన్, బ్రహ్మాజీ, జబర్దస్త్ మహేష్ ముఖ్య పాత్రలు పోషించారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. రాయ్ లక్ష్మి అందాల ఆరబోతతో సినిమాపై అంచనాలను పెంచింది. ఇప్పుడు ఈ అంచనాలను మరింత పెంచుతూ ‘ఏం జరుగుతోంది నాలో’ అనే రొమాంటిక్ సాంగ్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ లో పూజిత పొన్నాడ రెచ్చిపోయి రొమాన్స్ చేసింది. లిప్‌‌లాక్, రొమాంటిక్ సన్నిశాల్లో గాఢంగా నటించేసి కాకరేపుతోంది. పూజితను ఇప్పటి వరకు ఇంత గాఢమైన రొమాంటిక్ సన్నివేశాల్లో ప్రేక్షకులు చూసుండరు. దీంతో అసలు హీరోయిన్ లక్ష్మీ రాయా లేక పూజితా అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.