సాక్షి యాంకర్ అయిన రేణు…పవన్ తో పాటే ?

Renu Desai Joins In Sakshi TV

పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ లు విడిపోయి ఎవరి జీవితాలలో వారు బిజీగా ఉన్నారు. అయితే వీరిద్దరూ వేరువేరు మార్గాలలో ఉన్నా యాదృశ్చికంగా వీరిద్దరూ వేరువేరు కార్యక్రమాలతో కర్నూల్ జిల్లాలో ఒకేసారి ఎవరికివారు పర్యటనలు చేస్తూ ఉండటం పవన్ అభిమానుల మధ్య ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. రేణు దేశాయ్ సాక్షి ఛానల్ కోసం రైతుల సమస్యల పై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తూ ఏకంగా రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడటానికి కర్నూల్ జిల్లాలోని మంత్రాలయంలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తూ రైతుల సమస్యల గురించి రైతుల ఆత్మహత్యల గురించి రైతుల అభిప్రాయాలను సేకరిస్తోంది.

ప్రస్తుతం పవన్ కూడ ఇదే కర్నూల్ జిల్లాలో పర్యటిస్తూ జనం మధ్య మమేకం అవుతూ వెళ్తున్నాడు. రేణుదేశాయ్ మళ్ళీ నటిస్తోంది అంటేనే ఆశ్చర్యపోయి మాటలదాడి చేసిన పవన్ అభిమానులు ఇప్పుడు ఆమె యాంకర్ అవతారం ఎత్తడమే కాకుండా పవన్ ని తన మాటలతో విపరీతంగా దాడి చేస్తున్న వైసీపీ అధినేత జగన్ కు సంబంధించిన ఛానల్ లో ఈమె ప్రత్యేక క్రార్యక్రమాలు నిర్వహించడం పవన్ అభిమానులకు కూడ అంతు పట్టని విషయంగా మారింది. మరి ఆమె ఎందుకు సాక్షి యాంకర్ అవతారం ఎత్తింది అనేది కాలమే సమాధానం చెప్పాలి.