రిలీజ్ కి సిద్ధం అవుతున్న “జోరుగా హుషారుగా”

రిలీజ్ కి సిద్ధం అవుతున్న “జోరుగా హుషారుగా”
రిలీజ్ కి సిద్ధం అవుతున్న “జోరుగా హుషారుగా”

బేబి చిత్రంలో న‌టుడిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న యూత్‌ఫుల్ క‌థానాయ‌కుడు విరాజ్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ క‌థానాయిక‌ గా నటిస్తుండగా, అను ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు. శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ ప‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తు ఉన్నారు . యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ని డిసెంబ‌రు 15న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మాత నిరీష్ తిరువిధుల‌. ఇందుకు సంబంధించిన రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ని బుధ‌వారం విడుద‌ల చేశారు.

రిలీజ్ కి సిద్ధం అవుతున్న “జోరుగా హుషారుగా”
Zoruga Husaruga

ఈ సంద‌ర్భంగా నిర్మాత చిత్ర విశేషాల‌ను తెలియ‌జేస్తూ యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న చిత్ర‌మిది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌కి , పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.. సినిమాలో అంద‌ర్ని ఆక‌ట్టుకునే వినోదం కూడా వుంది. సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రూ ఒక మంచి సినిమా చూశామ‌నే అనుభూతికి లోన‌వుతారు. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారి స‌హ‌కారంతో సినిమా ని డిసెంబ‌రు 15న విడుద‌ల చేస్తున్నాం అన్నారు.