‘బేబీ’ డైరెక్టర్ కి భారీ కారు గిఫ్ట్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్

యువ నటుడు ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా యువ దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ ఎమోషనల్ సినిమా బేబీ. ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ల యాక్టింగ్ తో పాటు సాయి రాజేష్ అద్భుత దర్శకత్వ ప్రతిభ కి అందరి నుండి మంచి ప్రసంశలు కూడా దక్కాయి.

మాస్ సినిమా మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా ని ఎస్ కె ఎన్ గ్రాండ్ గా నిర్మించారు. మరోవైపు పలువురు ఆడియన్స్ తో పాటు సినీ ప్రముఖులు సైతం బేబీ పై పొగడ్తల వర్షం కురిపించారు. అయితే విషయం ఏమిటంటే, డైరెక్టర్ సాయి రాజేష్ కి భారీ విలువ కలిగిన బెంజ్ కారుని నిర్మాత ఎస్ కె ఎన్ గిఫ్ట్ గా నేడు అందించారంట . కాగా కారు అందుకున్న సాయి రాజేష్ అమితానందన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ మూవీ కి ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన సాయి రాజేష్, ఇటువంటి మరిన్ని మంచి మూవీ లతో రాబోయే రోజుల్లో ఆడియన్స్ ముందుకి వస్తానని అన్నారు.