తన నెక్స్ట్ చిత్రాలకి డైరెక్టర్స్ వీళ్ళే ..బేబీ ప్రొడ్యూసర్..!

నిర్మాత SKN ప్రస్తుతం తన చివరి చిత్రం అయిన బేబీ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ మరియు విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, SKN తన రాబోయే ప్రాజెక్ట్‌ల కోసం దర్శకుల పేర్లను వెల్లడించాడు. బేబీ దర్శకుడు సాయి రాజేష్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌లో మరో సినిమా కి దర్శకత్వం వహించనున్నారు.

తన నెక్స్ట్ చిత్రాలకి డైరెక్టర్స్ వీళ్ళే ..బేబీ ప్రొడ్యూసర్..!
Baby Movie Team

మిగిలిన ముగ్గురు దర్శకులు సందీప్ రాజ్, సుమన్ పాతూరి మరియు రవి నంబూరి. SKN ఈ దర్శకులతో కలిసి పోజులిచ్చిన ఫోటోను కూడా షేర్ చేసారు . అయితే, ఈ ప్రాజెక్ట్‌లకి సంబందించిన మరిన్ని వివరాలు కూడా త్వరలో వెల్లడి కానున్నాయి.