డీజే టిల్లుతో బేబీ రొమాన్స్.. వైష్ణవికి క్రేజీ ఆఫర్

డీజే టిల్లుతో బేబీ రొమాన్స్.. వైష్ణవికి క్రేజీ ఆఫర్
Latest News

బొమ్మరిల్లు భాస్కర్ మూవీ లకు ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. కానీ ఆయన ఫాం కోల్పోయి చాలా కాలమే అయింది. అఖిల్ పూజా హెగ్డేలతో కలిసి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అనే మూవీ ను తీశాడు.

డీజే టిల్లు తరువాత సిద్దు జొన్నలగడ్డకు మంచి క్రేజ్, డిమాండ్ బాగా ఏర్పడింది. డీజే టిల్లు స్వీకెల్ కూడా రెడీ అయింది. డీజే టిల్లులో టెక్నికల్‌గానూ సిద్దు హ్యాండ్ ఉంది. కథ, కథనాలు రాసుకోవడంలో సిద్దుకి మంచి టాలెంట్ ఉంది. తన సినిమాలకు తానే కథలు రాసుకుంటూ ఉంటాడు. అలాంటి మల్టీ టాలెంటెడ్ సిద్దుకి ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లోనూ మంచి ఆఫర్ దక్కించుకున్నాడు.

డీజే టిల్లుతో బేబీ రొమాన్స్.. వైష్ణవికి క్రేజీ ఆఫర్
DJ.Tilli , Vaishanvi Chaitanya

ప్రేమ కథా చిత్రాలను డీల్ చేసే బొమ్మరిల్లు భాస్కర్‌తో సిద్దు ఓకే చెప్పాదంట . బొమ్మరిల్లు, ఆరెంజ్, ఒంగోలు గిత్త అంటూ భాస్కర్ ప్రయోగాలు చేశాడు. అందులో బొమ్మరిల్లు బ్లాక్ బస్టర్ కాగా.. ఆరెంజ్ మ్యూజికల్ హిట్ అయింది. ఒంగోలు గిత్త ఫ్లాప్ అయింది. చివరగా అఖిల్, పూజా హెగ్డేలతో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అని అంటూ వచ్చాడు. అది ఓ మోస్తరుగా హిట్ అయింది. అఖిల్ కెరీర్‌లో కాస్తో కూస్తో మంచి టాక్ తెచ్చుకున్న చిత్రం ఏదైనా ఉందంటే అది ఇదే.

బొమ్మరిల్లు భాస్కర్, సిద్దు జొన్నలగడ్డ కాంబోలో రాబోతోన్న క్రేజీ సినిమా లో బేబీ హీరోయిన్‌ వైష్ణవికి ఆఫర్ వచ్చింది. బేబీ మూవీ బ్లాక్ బస్టర్ అయినా కూడా వైష్ణవికి ఆఫర్లు రావడం లేదేంటని అంతా అనుకున్నారు. కానీ వైష్ణవి చైతన్యకు మంచి ఆఫర్లే వస్తున్నాయని సమాచారం. అందులో భాగంగానే సిద్దుతో కలిసి వైష్ణవి నటించబోతోందట. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం అంటే హీరోయిన్ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుందన్న సంగతి మనకి తెలిసిందే.

వైష్ణవి సైతం తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలని కోరుకుంటుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల కోసమే ఆమె కూడా వెయిట్ చేస్తుంది . బేబీలో వైష్ణవి నటనకు చిరు సైతం ముగ్దుడైన సంగతి మనకి తెలిసిందే. మరి సిద్దు, వైష్ణవి, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి . షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్నది చూడాలి. యూట్యూబర్‌గా మొదలైన వైష్ణవి కెరీర్ ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతోంది.